విషాదం: తల్లి అంత్యక్రియలకు వెళ్తూ కొడుకు, కోడలు మృతి

Published : Feb 16, 2020, 11:48 AM ISTUpdated : Feb 16, 2020, 11:56 AM IST
విషాదం: తల్లి అంత్యక్రియలకు వెళ్తూ కొడుకు, కోడలు మృతి

సారాంశం

తల్లి అంద్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లూ కొడుకు, కోడలు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని యావల్‌గూడలో చోటు చేసుకొంది.


ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కొడుకు, కోడలు కూడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది.

Also read:కరీంనగర్‌‌లో బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

ఆదిలాబాద్ జిల్లా యవల్ గూడకు చెందిన రమణమ్మ అనారోగ్యంతో  శనివారం నాడుమృతి చెందింది. రమణమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రిటైర్డ్ సీఐ విజయ్‌కుమార్, కోడలు సునీత ఆదివారం నాడు బయలుదేరారు.  రిటైర్డ్ సీఐ విజయ్ కుమార్ ప్రయాణం చేస్తున్న కారు వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢికొట్టింది.

ఈ ఘటనలో రిటైర్డ్ సీఐ విజయ్‌కుమార్, ఆయన భార్య సునీత అక్కడికక్కడే మృతి చెందారు.కొడుకు మృతి చెందడంతో రమణమ్మ అంత్య క్రియలు నిలిపివేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం  నెలకొంది. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!