పెళ్లింట విషాదం.. తాళి కట్టిన కాసేపటికే వరుడు మృతి

Published : Feb 15, 2020, 11:27 AM ISTUpdated : Feb 15, 2020, 04:41 PM IST
పెళ్లింట విషాదం.. తాళి కట్టిన కాసేపటికే వరుడు మృతి

సారాంశం

తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ వేశాడు. భారాత్ లో భాగంగా డ్యాన్స్ వేస్తూ.. పెళ్లి కొడుకు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక బంధువులంతా షాకయ్యారు.


ఆ ఇంట్లో పెళ్లి మంత్రాలు వినపించి కొద్ది గంటలైనా కాలేదు. బాజాబజంత్రీలు ఇంకా పెళ్లికి వచ్చిన అతిథుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అంతలోనే చావు డబ్బులు వినాల్సి వచ్చింది. ఎన్నో ఆశలతో మూడు ముళ్లు వేయించుకున్న వధువు... కొన్ని గంటల్లోనే విదవగా మారాల్చి వచ్చింది. అమ్మాయి మెడలో తాళికట్టిన కొద్ది సేపటికే వరుడు కన్నుమూశాడు. ఈ దారుణ సంఘటన నిజామాబాద్ జిల్లా బోదన్ లో చోటుచేసుకుంది.

Also Read భార్య కాపురానికి రావడం లేదని మరో స్త్రీతో సంబంధం.. చివరకీ..

పూర్తి వివరాల్లోకి వెళితే....  నిజామాబాద్ జిల్లా బోధన్ లో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. వధువు మెడలో తాళికట్టిన ఆనందంలో పెళ్లి కొడుకు.. తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ వేశాడు. భారాత్ లో భాగంగా డ్యాన్స్ వేస్తూ.. పెళ్లి కొడుకు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక బంధువులంతా షాకయ్యారు.

వెంటనే తేరుకొని వరుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే... ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే పెళ్లి కొడుకు కన్నుమూశాడు. కాగా.. వరుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక వధువు పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్