తల్లి మందలించిందని రాడ్ తో కొట్టి చంపిన సైకో తనయుడు.. చెల్లిపై కూడా దాడి..

Published : Jan 24, 2022, 01:18 PM IST
తల్లి మందలించిందని రాడ్ తో కొట్టి చంపిన సైకో తనయుడు.. చెల్లిపై కూడా దాడి..

సారాంశం

దీంతో ఆవేశానికి లోనైన సుధీర్ అత్యంత దారుణంగా Iron rodతో తల్లి తలపై బలంగా కొట్టాడు. అడ్డు వచ్చిన చెల్లెల్ని కూడా రాడ్ తో కొట్టాడు. దీంతో ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయారు.ఇది గమనించిన ఇరుగురు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే లోపే తల్లి పాపమ్మ మృతి చెందింది. చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. 

హైదరాబాద్ : కనీ పెంచిన తల్లిపైనే ఓ son అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. మందలించిందన్న కోపంతో తల్లిని దారుణంగా murder చేశాడు. హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపమ్మ ఆమె కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. అయితే అర్థరాత్రి 2.30 గంటల సమయంలో కొడుకు సుధీర్ Exercise చేస్తుండగా తల్లి మందలించింది. 

దీంతో ఆవేశానికి లోనైన సుధీర్ అత్యంత దారుణంగా Iron rodతో తల్లి తలపై బలంగా కొట్టాడు. అడ్డు వచ్చిన చెల్లెల్ని కూడా రాడ్ తో కొట్టాడు. దీంతో ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయారు.ఇది గమనించిన ఇరుగురు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే లోపే తల్లి పాపమ్మ మృతి చెందింది. చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. 

తీవ్ర గాయాలైన చెల్లిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, మృతి చెందిన పాపమ్మను మార్చురీకి తరలించాడు. అయితే, గత కొన్ని రోజులుగా సుధీర్ సైకోగా (మతిస్థిమితం లేని) ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుధీర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఇదిలా ఉండగా,  Kolkataలో ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. భార్యను murder చేయడానికి ఏకంగా contract killerలను నియమించుకున్నాడు. వారికి సుపారీ ఇచ్చి మరీ పనికి పురమాయించాడు. సదరు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యమీద ఇంత తీవ్రమైన కోపానికి కారణం ఏంటంటే.. ఆమె భర్త అనుమతి లేకుండి smart phone కొనుక్కోవడమేనని తేలింది. 

ఆ కాంట్రాక్ట్ కిల్లర్ల మహిళ మీద నిందితులు పదునైన వస్తువులతో దాడిచేసి.. గాయపర్చడంతో మహిళ గొంతుకు గాయమయ్యింది. ఆమెకు ఏడు కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. కోల్‌కతా.. దక్షిణ శివార్లలోని నరేంద్రపూర్‌లో గురువారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన వారిలో మరో వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

నరేంద్రపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ... “మహిళ చెబుతున్న దాని ప్రకారం, ఆమె కొన్ని నెలల క్రితం తన భర్తను స్మార్ట్‌ఫోన్ కొనివ్వమని అడిగింది. దీనికి అతను నిరాకరించాడు. దీంతో ట్యూషన్‌ లు చెబుతూ కొంత డబ్బు సంపాదిస్తున్న మహిళ.. ఆ డబ్బుతో జనవరి 1న స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో అతను కోపోద్రిక్తడయ్యాడు. మహిళను చంపేస్తానని బెదిరించాడు”

ఎప్పటిలాగే గురువారం రాత్రికూడా ఇంటి మెయిన్‌ డోర్‌కు తాళం వేసిన భర్త తిరిగి రాలేదు. అతను ఎంత సేపటికీ తన రూంలోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య.. భర్త కోసం బైటికి వెళ్లి చూసింది. ఇంతలో అప్పటికే అక్కడ కాపు వేసిన ఇద్దరు వ్యక్తులు ఆమె మీద దాడి చేశారు. పదునైన ఆయుధాలతో గొంతు కోశారు. వారినుంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Sensational Comments On CM Revanth Reddy In Assembly | Asianet Telugu
MLC Addanki Dayakar Sensational Comments On KCR | Asianet Telugu