
ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత, పార్టీ సౌత్ ఇండియా ఇన్ చార్జ్ సోమనాథ్ భారతీపై దాడి జరిగింది. గురువారం ఆయన రాజీవ్ గాంధీ ఏయిర్ పోర్టు నుంచి కారులో వస్తుండగా
గుర్తు తెలియన వ్యక్తి ఐరన్ రాడ్ తో ఆయన కారుపై దాడి చేశాడు.
అయితే ఈ ఘటన నుంచి సోమనాథ్ భారతీ తృటిలో తప్పించుకున్నారు. కాగా, పార్టీ తెలంగాణ జాయింట్ సెక్రటరీ హైదర్ అబ్బాస్ స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై పార్టీ నేతలు ఏయిర్ పోర్టు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.