సారీ పూర్ణ.. నువ్వేం సానియా కాదుగా..!

First Published Feb 15, 2017, 1:15 PM IST
Highlights

రూ. 25 లక్షల ప్రైజ్ మనీ మాత్రం సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా ఆమెకు అందించారు. మిగిలిన హామీలకు ఇప్పటి వరకు దిక్కులేదు.

 

మాలావత్ పూర్ణ.... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అవలీలగా అధిరోహించింది. తెలంగాణ గర్వించేలా శిఖరం చేరింది. చరిత్ర సృష్టించింది.

కానీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన ప్రైజ్ మనీ ని రాబట్టుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమైంది.

 

మూడేళ్లు గడిచినా ఇంకా ఎవరెస్టు అధిరోహించిన ఈ తెలంగాణ బిడ్డ కు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందనే లేదు.

 

2014 లో మే లో ఎవరెస్టు అధిరోహించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తూ రూ. 25 లక్షల ప్రైజ్ మనీతో పాటు మూడు బెడ్ రూం ల ఇళ్లు, ఐదు ఎకరాల స్థలాన్ని ఆమెకు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించింది.

 

రూ. 25 లక్షల ప్రైజ్ మనీ మాత్రం సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా ఆమెకు అందించారు. మిగిలిన హామీలకు ఇప్పటి వరకు దిక్కులేదు.

 

దీనిపై మాలావత్ పూర్ణ తండ్రి... అధికారుల చుట్టూ తిరుగుతున్న ఇప్పటి వరకు వారు స్పందించడటమే లేదు.

 

కాగా, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మిర్జాను నియమించిన వెంటనే ప్రభుత్వం ఆమె కోటి రూపాయిల చెక్కును అందజేసింది. ఇటీవల ఒలంపిక్ పతకం గెలిచిన పీవీ సింధూకు, ఆమె కోచ్ గోపీ చంద్ కు కూడా నజరానాతో పాటు కావాల్సిన చోట ఉచితంగా స్థలాన్ని కేటాయించింది.

అదే పూర్ణ విషయం వచ్చేసరికి హామీ ఇచ్చిన నేతలే కాదు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.

 

click me!