అసెంబ్లీలో రెండోరోజు చర్చలు వాడీ, వేడీగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ల మధ్య వాగ్వాదం జరిగింది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు శనివారం సభలో వాడి, వేడి చర్చ జరుగుతోంది. ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ఆమె మాట్లాడిందంతా కాంగ్రెస్ మానిఫెస్టోలా ఉందన్నారు. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి 1.8శాతం మాతమ్రే తేడా ఉందన్నారు. అంతగా అధికారంలో ఉన్నామని వీగొద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ చెప్పుకోవాల్సి వస్తే.. కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్ని లెక్కలు, నీళ్ల లెక్కలు కూడా లెక్క తేల్చాలన్నారు.
దీనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయం కోసమే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. మళ్లీ దాన్నిప్పుడు ఇక్కడ, ఈ సభలో చర్చించడం సబబు కాదన్నారు. దాన్ని లెక్క తేల్చాలంటే ఏపీకి పోవాలని చెప్పారు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ కే అత్యధిక నిధులు..
undefined
ఆ తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నా రిప్లై గురించి బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని అన్నారు. ఆయన మాట్లాడుతూ..కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్పూర్తి తెలియదు అంటూ కేటీఆర్ కు చురకలు వేశారు. చీమలు పెట్టిన పుట్టను పాములు ఆక్రమించినట్లు సిరిసిల్లలో మహేందర్ రెడ్డి అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే, కేటీఆర్ అక్కడినుంచి పోటీచేశారని అన్నారు. ఉద్యమంలో కొట్లాడిన నేత మహేందర్ రెడ్డి అన్నారు. మేనేజ్మెంట్ కోటాలో అక్కడికి వచ్చిన కేటీఆర్ అక్కడినుంచి గెలిచారని.. మహేందర్ రెడ్డిని గల్లంతు చేశారని చెప్పుకొచ్చారు.
51 శాతానికి 49 శాతానికి చాలా తేడా ఉంది అన్నారు. 49 అంటే సున్నాతో సమానం అని 51 అంటే మెజారిటీ అని చెప్పుకొచ్చారు. సభ్యుల సంఖ్య కాదు ప్రజాస్వామ్య స్పూర్తి ముఖ్యం అన్నారు. ఈ సందర్భంగానే కేటీఆర్ ను ఉద్దేశించి ఎన్నారై అని సంభోదించారు. కేసీఆర్ ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసిందే కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పాలనకు ఐదేళ్ళ సమయం ఉందని.. ఇన్నేళ్లు జరిగినవాటన్నింటి మీద పరిశీలిస్తామని, అన్ని లెక్కలు తీస్తామన్నారు. తొమ్మిదేళ్ల పాలనతో ఏం జరిగిందో ఎక్స్ రే తీసినట్టుగా ముందు పెడతాం అన్నారు.
కాదు, కూడదు అచ్చోసిన ఆంబోతులం పోడియం మీదికి వస్తాం అంటే ఊరుకోం అన్నారు. గతం గురించి మాట్లాడదాం అంటే ఒకరోజు సమయం ఇవ్వండి.. పూర్తిగా దానిమీదనే చర్చ చేద్దాం అన్నారు. ఆ తరువాత హరీష్ రావు, ఐటీ మంత్రి హరీష్ రావులు దీని మీద మాట్లాడారు.