తెలంగాణ ఇక కొత్త పేర్లతో బీర్లు లభించనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బూమ్ బూమ్ బీర్ల మాదిరిగానే తెలంగాణలోనూ విచిత్రమైన పేర్లతో బీర్లు దర్శనమివ్వనున్నాయి.
హైదరాబాద్ : మద్యం ప్రియులు మరీ ముఖ్యంగా యువత బీర్లు తాగేందుకు బాగా ఇష్టపడుతున్నారు. కింగ్ ఫిషర్, బడ్వైజర్ వంటి బాగా సుపరిచితమైన బీర్లనే ఎక్కువగా లాగిస్తుంటారు. కానీ తెలంగాణలో గతకొంత కాలంగా ప్రముఖ బీర్ల కొరత ఏర్పడింది... కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకడం లేదంటూ ఏకంగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు కొందరు లేఖలు రాసారంటేనే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కొరతను కావాలనే సృష్టించారని... దీని వెనక పెద్ద కుట్ర దాగివుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ అనుమానాలే నిజమవుతూ తెలంగాణలో కొత్తరకం బీర్ల అమ్మకాలకు రేవంత్ సర్కార్ అనుమతి ఇచ్చినట్లుగా సమాచారం.
తెలంగాణలో ఇక ఈ బీర్లే..:
undefined
ఆంధ్ర ప్రదేశ్ లో బూమ్ బూమ్ బీర్లపై ఎంత ట్రోలింగ్ నడిచిందో అందరికీ తెలిసిందే. బ్రాండెడ్ మద్యాన్ని కాకుండా ఎన్నడూ చూడని నాసిరకం బ్రాండ్ల అమ్మకాలను వైఎస్ జగన్ సర్కార్ ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణ ఏర్పడింది. రేవంత్ సర్కార్ కూడా కమీషన్ల కోసం నాసిరకం మద్యం బ్రాండ్స్ ను తెలంగాణకు తెస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అయితే ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనేమో అనిపించేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు వున్నాయి. తాజాగా కొత్తరకం బీర్ల అమ్మకాలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. మధ్య ప్రదేశ్ కు చెందిన బీర్ల తయారీ సంస్థ సోమ్ డిస్టిలరీస్ కు రేవంత్ సర్కార్ అనుమతి లభించింది. దీంతో ఆ సంస్థకు చెందిన పవర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పికర్ వంటి బీర్లు ఇక తెలంగాణలో కనిపించనున్నాయి.
తెలంగాణలో ఎంట్రీపై సోమ్ డిస్టిలరీస్ కన్ఫర్మ్ :
తెలంగాణలో తమ కంపనీ బీర్ల అమ్మకాలకు ప్రభుత్వ అనుమతి లభించిందని సోమ్ డిస్టిలరీస్ స్టాక్ ఎక్స్చేంజ్ కు లేఖ రాసింది. తెలంగాణ మార్కెట్ లోకి ప్రవేశించడం ద్వారా తమ బిజినెస్ మరింత పెరుగుతుందని ....కంపనీ విస్తరణకు మంచి అవకాశాలు వుంటాయని ఆ లేఖలో పేర్కొంది. మార్కెట్ ను పెంచుకోడానికి ఇదో మంచి అవకాశమని... రాబోయే కొద్దిరోజుల్లో తమ సేల్స్ గణనీయంగా పెరుగుతాయని సోమ్ డిస్టిలరీస్ ఆశాభావం వ్యక్తం చేసింది.
రేవంత్ సర్కార్ పై ఆరోపణలు :
దేశంలో మద్యం విక్రయాలు అధికంగా జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ముఖ్యంగా బీర్ల అమ్మకాల్లో అయితే రాష్ట్రం టాప్ లో వుంటుంది. దీన్ని తమ రాజకీయ అవసరాల కోసం రేవంత్ సర్కార్ వాడుకునేందుకు సిద్దమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కమీషన్ల కోసం రెగ్యులర్ గా దొరికే బీర్లు కొరత సృష్టించి కొత్త రకం బ్రాండ్స్ ను తెరపైకి తెస్తున్నారని... అందులో భాగమే సోమ్ డిస్టిలరీస్ కు అనుమతివ్వడమని అంటున్నారు. కొత్తగా చేపట్టే నాసిరకం బీర్ల అమ్మకాలతో తెలంగాణ ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం వుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బిఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపణలు :
సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తయారు చేసిన కల్తీ మందు తాగి మధ్యప్రదేశ్‌లో 24 మంది చనిపోయారని బిఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపించారు. ఇలా కల్తీ మందు తయారు చేస్తున్నారనే సోమ్ డిస్టిలరీస్ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేసిందన్నారు. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తెస్తుందని క్రిషాంక్ ఆందోళన వ్యక్తం చేసారు.
అయితే ఎన్నికల వేళ ఆర్థిక సాయం చేసింది కాబట్టే ఈ సోమ్ డిస్టిలరీస్ కు రేవంత్ సర్కార్ అనుమతి ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ కు సోమ్ డిస్టిలరీస్ ఇచ్చిన విరాళాల వివరాలను కూడా క్రిషాంక్ బయటపెట్టారు. ఈ సంస్థకు చెందిన మద్యం తాగడం చాలా ప్రమాదకరమని క్రిషాంక్ పేర్కొన్నాడు.
సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తయారు చేసిన కల్తీ మందు తాగి మధ్యప్రదేశ్‌లో 24 మంది చనిపోయారు.
కల్తీ మందు తయారు చేస్తున్నారని మధ్యప్రదేశ్‌లో ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థను బ్యాన్ చేశారు.
సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు విరాళాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ… pic.twitter.com/eWRQxzS6MT