పెళ్లై నాలుగు నెలలే: భార్య వేధింపులతో టెక్కీ ఆత్మహత్య

By telugu teamFirst Published Jun 22, 2019, 2:56 PM IST
Highlights

హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సుమంత్ రెడ్డికి నాలుగు నెలల క్రితం స్వప్నతో పెళ్లయింది. సుమంత్ రెడ్డి మరణానికి సంబంధించిన సమాచారం చేరగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: భార్య, అత్త వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న టెక్కీని సుమంత్ రెడ్డిగా గుర్తించారు. శుక్రవారం రాత్రి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సుమంత్ రెడ్డికి నాలుగు నెలల క్రితం స్వప్నతో పెళ్లయింది. సుమంత్ రెడ్డి మరణానికి సంబంధించిన సమాచారం చేరగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అత్త, భార్య వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. 
 
"అమ్మా, నాన్న నన్ను క్షమించండి. శ్రవంత్ బాగా చదువుకో. నా సూసైడ్‌కి స్వప్న కారణం. ఆమె అమ్మ, బాబాయి, సోదరుడిని అంత్యక్రియలకు రానివ్వకండి. ప్రశాంత్, వెంకట్ బావ.. మిమ్మల్ని మిస్ అవుతున్నాను. నాన్నా ఐలవ్యూ. వృద్ధాప్యంలో నిన్ను చూసుకోవల్సిన నేను.. స్వప్న, వాళ్ల అమ్మ వేధింపులతో ఈ లోకాన్ని విడిచి వెళుతున్నాను" అని సుమంత్ రెడ్డి తన సూసైడ్ నోట్ లో రాశాడు. 

click me!