ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..

By AN TeluguFirst Published Nov 10, 2021, 9:52 AM IST
Highlights

ఉదయం 9 గంటల సమయంలో ఆమె గదిలోకి Nurse వెళ్లగా లోపలినుంచి తలుపు గడియ పెట్టుకుని ఉంది. సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికెళ్లారు. సుదీప్తి ఫ్యానుకు ఉరివేసుకుని Suicideకు పాల్పడింది. 

రాజేంద్రనగర్ : చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లిన మహిళ మరో నాలుగైదు గంటల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాజేంద్రనగర్ సీఐ కనకయ్య తెలిపిన వివరాల మేరకు నెల్లూరుకు చెందిన సుదీప్తి (27) అవివాహిత.

బండ్లగూడజాగీర్ లోని అపార్ట్ మెంట్లో ఉంటూ ఓ కంపెనీలో Software employeeగా పనిచేస్తోంది. ఈ నెల 6న అనారోగ్యంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. మూడు రోజులుగా Treatment తీసుకుంటూ పూర్తిగా కోలుకుంది. మంగళవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ కావాల్సి ఉంది.

ఉదయం 9 గంటల సమయంలో ఆమె గదిలోకి Nurse వెళ్లగా లోపలినుంచి తలుపు గడియ పెట్టుకుని ఉంది. సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికెళ్లారు. సుదీప్తి ఫ్యానుకు ఉరివేసుకుని Suicideకు పాల్పడింది. ఆసుపత్రి నిర్వాహకులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. యువతి తల్లి బెంగళూరులో ఆమె సోదరుడి దగ్గర ఉంటోంది. 

వివాహితతో సంబంధం.. యువకుడు ఆత్మహత్య...

మహబూబ్ నగర్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని కలిగిన యువతితో కలిసి అతడు ఓసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వివాహిత చనిపోగా అతడు మాత్రం బ్రతికాడు. అయితే ప్రియురాలి మృతిని తట్టుకోలేకపోయిన అతడు తాజాగా మరోసారి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

భీమవరంలో విషాదం: కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి, అమ్మమ్మ సూసైడ్

వివరాల్లోకి వెళితే... mahabubnagar district దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుకు ఎక్లాపూర్ గ్రామానికి చెందిన మహిళతో కొన్నేళ్లక్రితం వివాహమైంది. అయితే పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా వీరికి సంతానం కలగకపోవడంతో భార్య అంగీకారంతోనే ఆమె చెల్లి అక్షిత(25) ను ఆంజనేయులు పెళ్లాడాడు. వీరికి మూడేళ్ల కొడుకు వుండగా అక్షిత ఏడు నెలల గర్భిణి. 

అయితే అదే గ్రామానికి చెందిన మధు(20) అనే యువకుడితో అక్షితకు పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతరసంబంధానికి దారితీసింది. అయితే ఏమయ్యిందో తెలీదుగానీ గత నెల(అక్టోబర్) చివర్లో మధు, అక్షిత ఒకేగదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.వీరిని గమనించిన కుటుంబసభ్యులు ఇద్దరినీ కాపాడి కొనఊపిరితో వున్న వారిని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ అక్షిత ప్రాణాలు కోల్పోయింది.  

మధు మాత్రం కొన్నిరోజుల చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన అతడిని కుటుంబసభ్యులు అడ్డాకుల మండలం గుడిబండలోని పెద్దమ్మ జయమ్మ ఇంట్లో వుంచారు. అయితే  ప్రియురాలి జ్ఞాపకాలతో తీవ్ర డిప్రెషన్ కు లోనయిన మధు మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటిముందున్న చెట్టుకు అర్ధరాత్రి ఉరేసుకోగా తెల్లవారుజామున అతడి పెద్దమ్మ గుర్తించింది. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. 

వెంటనే మధు తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకుదించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.  ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. 

click me!