Punjagutta child dead body: చిన్నారి హత్యలో సవతి తల్లి ప్రమేయం?

By telugu teamFirst Published Nov 10, 2021, 9:10 AM IST
Highlights

హైదరాబాదులోని పంజగుట్టలో కనిపించిన చిన్నారి మృతదేహం కేసు దర్యాప్తులో పోలీసులు ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటున్నారు. పాప హత్య కేసులో సవతి తల్లి ప్రమేయం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పంజగుట్టలో కనిపించిన చిన్నారి మృతదేహం కేసులో పోలీసులు వివిధ కోణాల నుంచి దర్యాప్తు సాగిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా చిన్నారి హత్య జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ హత్యలో చిన్నారి సవతి తల్లి ప్రమేయం ఉండవచ్చునని కూడా అనుమానిస్తున్నారు. బెంగళూరు నుంచి చిన్నారి పాప శవంతో హైదరాబాదులోని లక్డీకా పూల్ కు బస్సులో చేరుకున్న ముగ్గురు వ్యక్తులు ఆటోలో పంజగుట్టకు వచ్చారని భావిస్తున్నారు. 

చిన్నారి హత్య కేసును ఛేదించడానికి పోలీసులు 300 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. పంజగుట్టలో పాప శవాన్ని మూసి ఉన్న దుకాణం ముందు వదిలేసి తిరిగి మెహిదీపట్నం వైపు వెళ్లారని పోలీసులు అనుకుంటున్నారు. మెహిదీపట్నం నుంచి వారు కర్ణాటక రాజధాని బెంగళూరు చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడానికి హైదరాబాదు పంజగుట్ట పోలీసులు బెంగళూరు వెళ్లారు.

ఐదేళ్ల చిన్నారిని కర్ణాటక రాజధాని బెంగళూరులో చంపేసి, శవాన్ని హైదరాబాదులోని పంజగుట్టలో మూసి ఉన్న దుకాణం ముందు వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. పంజగుట్ట దుకాణం ముందు ఇటీవల పాప శవం కనిపించడంతో తీవ్ర కలకలం చేలరేగిన విషయం తెలిసిందే.

Also Read: Punjagutta child dead body: బెంగళూరులో చంపి పంజగుట్టలో పడేశారు

పాప శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రి నుంచి పోస్టుమార్టం నివేదిక పాపను Murder చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చి దర్యాప్తు సాగించారు. దీపావళి పర్వదినం రోజున పంజగుట్టలోని జేవీఆర్ పార్కు ఎందురుగా ఉన్న ద్వారాకపురి కాలనీలో మూసి ఉన్న దుకాణం ముందు పాప ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసుల కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. దాంతో పంజగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాప గొంతుపై, కడుపుపై గాయాలు కనిపించినట్లు చెబుతున్నారు.

బాలిక మృతదేహం పడి ఉన్న చోట పోలీసులకు ఏ విధమైన రక్తం మరకలు కూడా కనిపించలేదు. దాంతో పాప హత్య శవం పడి ఉన్న చోట జరగలేదని నిర్ధారణకు వచ్చారు. మరో చోటు హత్య చేసి బాలిక శవాన్ని ఇక్కడ పడేసి ఉంటారని భావించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఓ మహిళ చిన్నారి మృతదేహాన్ని తీసుకుని వచ్చి పడేసినట్లు తెలుసుకున్నారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి, పురోగతి సాధించారు. 

చిన్నారిపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఆ దాఖలాలు లేవు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు కూడా Punjagutta పోలీసులు తెప్పించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లకు బాలిక ఫొటోను పంపించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా బాలిక ఫోటోను పెట్టారు. 

Also Read: మూసి ఉన్న దుకాణం ఎదుట బాలిక మృతదేహం మిస్టరీ...

click me!