మసాజ్ చేసుకుంటే ఒళ్లునొప్పులు పోయి హాయిగా వుండటమేమోగానీ బంగారం పోయి బాధగా వుందంటున్నాడు హైదరబాదీ సాప్ట్ వేర్.
హైదరాబాద్ : అక్కడ సుతిమెత్తగా మసాజ్ చేస్తుంటే మీరు ఒళ్లుమరిచారో అంతే సంగతి. మసాజ్ తో ఒంటి నొప్పులు పోవడమేమో గాని ఒంటిపై వుండే బంగారం మాత్రం పోతుందని అంటున్నాడు ఓ బాధితుడు. ఇలా మసాజ్ ముసుగులో దొంగతనానికి పాల్పడుతున్నారంటూ ఓ బార్బర్ షాప్ పై పోలీసులకు ఫిర్యాదుచేసాడు యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.
బాధిత యువకుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆదిత్య నివాసముంటున్నాడు. సెలవురోజు కావడంతో అతడు స్థానికంగా వున్న ఓ బార్బర్ షాప్ కు వెళ్లి మసాజ్ చేయించుకున్నాడు. అయితే మసాజ్ తర్వాత ఇంటికెళ్లిన ఆదిత్య మెడలోని బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో అతడు బార్బర్ షాప్ కు వెళ్ళి అడగ్గా తమకేమీ తెలియదని సమాధానమిచ్చారు. ఆదిత్య మాత్రం మసాజ్ చేసే క్రమంలోనే తన మెడలోని చెయిన్ తీసివుంటారని అనుమానిస్తున్నాడు.
Read More మహిళ స్నానం చేస్తుండగా వీడియోతీస్తూ... అడ్డంగా బుక్కయిన ఆకతాయి
బార్బర్ షాప్ సిబ్బంది తన మెడలోని రూ.80వేల విలువైన బంగారు గొలుసు దొంగిలించారని అనుమానం వ్యక్తచేస్తూ ఆదిత్య బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు అనుమానిస్తున్న బార్బర్ షాప్ సిబ్బందిని విచారిస్తున్నారు పోలీసులు.