Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపులు... ఆకతాయి అరెస్ట్

By Rajesh Karampoori  |  First Published Feb 19, 2024, 11:36 PM IST

Shamshabad Airport: నకిలీ బెదిరింపులకు పాల్పడిన ఓ ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. విమానాల్లో హైజాకర్లు ఉన్నారంటూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపాడు. 


Shamshabad Airport: ఈ మధ్యకాలంలో బెదిరింపులకు పాల్పడటం కొందరికి అలవాటుగా మారింది. అవతలి వ్యక్తులకు గుండెపోటు వచ్చేంత పనులు చేసి ప్రాంక్ అనడం సరదగా మారింది. పదే పదే బెదిరింపులకు పాల్పడిన ఓ ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఆర్‌జిఐఎ) బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడిన మాజీ ఐటీ ఉద్యోగిని సైబరాబాద్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైజాకర్ చేయబోతున్నట్టు ఒక ఇమెయిల్ పంపాడు.

సైబరాబాద్ పోలీసుల ప్రకారం.. ఫిబ్రవరి 15 న ఉదయం 7 గంటలకు వైభవ్ తివారీ ఓ బెదిరింపు మెయిల్ చేశాడు. అందులో హైజాకర్ వస్తున్నాడు. మీరు ఎయిర్ పోర్ట్ ఓపెన్ చేయవద్దని పంపించాడు. ఆదివారం సైతం నిందితుడు వైభవ్ మరో బెదిరింపు మెయిల్ ఎయిర్ పోర్ట్ అధికారులకు పంపాడు. దీంతో విమానాశ్రయ అధికారులు భయాందోళనకు గురయ్యారు.వివరాలు సేకరించిన ఎయిర్ పోర్ట్ అధికారులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. 

Latest Videos

వాస్తవానికి.. నిందితుడు వైభవ్ తివారీది బీహార్. కానీ, బెంగళూరులో స్థిరపడ్డాడు, 2012 నుండి 2020 వరకు ITలో పనిచేశాడు. COVID-19 మహమ్మారి సమయంలో అనారోగ్యం కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. దీంతో అతడు నిరాశకు లోనయ్యాడు. RGIA విమానాశ్రయానికే కాదు.. గత కొంతకాలం నుంచి ఇలా ఇతర ముఖ్యమైన సంస్థలకు  నకిలీ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నాడు. దాదాపు వందసార్లు ఇలాంటి ఫేక్ వార్నింగ్ అలర్ట్ మెయిల్స్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.  అతని పై ఐపీసీ సెక్షన్ 385, 507 కింద ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

click me!