పాములు పట్టే వ్యక్తిని ఆ పామే కరిసింది..!

Published : Nov 25, 2020, 09:05 AM IST
పాములు పట్టే వ్యక్తిని ఆ పామే కరిసింది..!

సారాంశం

సంచికి తాడు కడుతుండగా చేతిపై పాము కాటు వేసింది. వెంటనే కేజీహెచ్ కు వెళ్లగా వైద్యులు పరిశీలించారు. 

పాములు పట్టడం అతని విద్య. ఊహ తెలిసినప్పటి నుంచి పాములను అతి చాకచక్యంగా అతను పాములు పట్టగలడు.. దానిని బుట్టలో వేయగలడు. అలాంటి వ్యక్తిని అనుకోని రీతిలో పట్టుకున్న పామే అతనిని కాటేసింది. హెచ్ పీసీఎల్ రిఫైనరీ ప్రహరీకి ఆనుకోని ఉన్న రాంనగర్ లోని ఓ ఇంట్లో మంగళవారం నాగుపాము రావడంతో కుటుంబ సభ్యులు పాములు పట్టే నేర్పరి నాగరాజుకు సమాచారం ఇచ్చారు.

అతను అక్కడకు చేరుకొని పామును బంధించాడు. దానిని గోనె సంచిలో వేస్తుండగా.. పాము తల బయటకు వచ్చిన విషయాన్ని చీకట్లో గమనించలేదు. సంచికి తాడు కడుతుండగా చేతిపై పాము కాటు వేసింది. వెంటనే కేజీహెచ్ కు వెళ్లగా వైద్యులు పరిశీలించారు. నాగరాజు చేతిపై పాము పన్ను దిగి విరిగిపోయినట్లు గుర్తించి దానిని తొలగించారు.

విషయం శరీరంలోకి ఎక్కిందా లేదా అనేది తెలియాలంటే రక్త పరీక్ష చేయాల్సి ఉంటుందని.. అయితే.. ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలిక్ బ్రేక్
కొత్త ఇంటికి కరెంట్ మీట‌ర్ ఎలా తీసుకోవాలి? అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు