జగిత్యాలలో టెక్కీ సజీవ దహనం: భార్య ప్లాన్ ప్రకారమే...

By telugu teamFirst Published Nov 25, 2020, 8:11 AM IST
Highlights

తెలంగాణలోని జగిత్యాలలో జరిగిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు పవన్ కుమార్ హత్య కేసులో అతని భార్య కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పనవ్ కుమార్ ను గదిలో పెట్టి, తాళం వేసి సజీవ దహనం చేశారు.

జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ శివారులో సోమవారం జరిగిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాచర్ల పవన్ కుమార్ సజీవ దహనం సంఘటనలో ఆయన భార్య కీలక పాత్ర పోషించింది. అతన్ని పథకం ప్రకారమే సజీవ దహనం చేశారని పోలీసులు చెప్పారు. సంఘటన జరిగిన తర్వాత పవన్ కుమార్ ను తన మరదలు సజీవ దహనం చేసిందని అతని భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్తను హత్య చేసిన ఘటనలో కృష్ణవేణి కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. సీఐ కిశోర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కృష్ణవేణి ఏడాది క్రితం ఆదిలాబాదులోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె బంగారు ఆభరణాల దొంగతనం జరిగింది. అప్పటి నుంచి పవన్ కుమార్ భార్యతో గొడవ పడుతూ వస్తున్నాడు. 

See Vodeo: అఘోరాలతో భర్తను చంపించాడని అనుమానం.. ఆడపడుచు భర్తను సజీవదహనం

వాటిని తన బావమరిది జగన్ దొంగిలించాడనే అనుమానంతో అతన్ని పవన్ కుమార్ దూషిస్తూ వచ్చాడు చంపుతానని కూడా బెదిరించాడు. జగన్ గుండెపోటుతో ఇటీవల మరణించాడు. పవన్ కుమార్ చేతబడి చేయించడం వల్లనే అతను మరణించాడని బల్వంతపూర్ శివారులో గల మంజునాథ ఆలయం, ఆశ్రమం నిర్వహిస్తున్న కృష్ణవేణి అన్న విజయస్వామి తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. 

దాంతో పవన్ కుమార్ ను చంపడానికి కృష్ణవేణి, విజయస్వామిలతో పాటు మరదలు సుమలత, అక్క స్వరూప, అమ్మ ప్రమీల పథకం వేశారు. జగన్ ద్వాదశ దిన కర్మ సందర్బంగా సోమవారం మంజునాథ ఆలయం పక్కన గల ఓ గదిలో జగన్ చిత్రపటానికి పవన్ కుమార్ శ్రద్ధాంజలి ఘటిస్తున్న సమయంలో తలుపులు మూసి, బయట తాళం వేశారు. 

ఆ తర్వాత కృష్ణవేణితో పాటు సమీప బంధువులు, కొండగట్టుకు చెందిన నిరంజన్ రెడ్డి అనే యువకుడు కలిసి గది కిటికీ, జాలీల నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాంతో పవన్ కుమార్ మరణించాడు. పవన్ కుమార్ తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కృష్ణవేణితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు, నిరంజన్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

click me!