తెలంగాణ కరోనా అప్ డేట్: 10వేలకు చేరిన యాక్టివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Nov 25, 2020, 08:47 AM ISTUpdated : Nov 25, 2020, 09:06 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: 10వేలకు చేరిన యాక్టివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి.  

హైదరాబాద్:  తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో (సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 47,593 టెస్టులు చేయగా  993 పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 52,48,807 చేరగా కేసుల సంఖ్య 2,66,842కి చేరింది.   

ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1150 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,53,715కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 10,886 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1441కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.7శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 95.36 శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 161కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 93, రంగారెడ్డి 62, భద్రాద్రి కొత్తగూడెం 67, కరీంనగర్ 46, ఖమ్మం57,   సంగారెడ్డి 34, సిద్దిపేట 17, సూర్యాపేట 21, వరంగల్ అర్బన్ 39, నల్గొండ 45, మంచిర్యాల 28, జగిత్యాల 39, పెద్దపల్లి 21, సిరిసిల్ల 25, నిజామాబాద్ 20, ములుగు 25, మెదక్ 27, కామారెడ్డి 23 కేసులు నమోదయ్యాయి.  

పూర్తి వివరాలు:

 

PREV
click me!

Recommended Stories

Summer Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే న్యూస్.. ఎక్స్ట్రాగా మరో వారం వేసవి సెలవులు, ఎప్పటినుండి ఎప్పటివరకు?
టెన్త్ టాపర్ భవితకు ఊహించని సర్ప్రైజ్! | Komatireddy Venkat Reddy Helps Student Bhavitha