ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి . రేపు ఆయన పాల్గొనాల్సిన నర్సాపూర్ సభ రద్దయ్యింది . షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహించాల్సి వుంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు ఆయన పాల్గొనాల్సిన నర్సాపూర్ సభ రద్దయ్యింది. సంగారెడ్డి నుంచి నేరుగా మెదక్ వెళ్లనున్నారు ఖర్గే. అలాగే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహించాల్సి వుంది.
ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు విడతల్లో అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ప్రచారం చేయించిన కాంగ్రెస్.. మరింత మంది నేతలను రంగంలోకి దించుతోంది. శనివారం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాండూరు, పరిగి, చేవెళ్లలో ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇవ్వనున్నారు.
మరోవైపు.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదివారం తెలంగాణకు రానున్నారు. సంగారెడ్డిలో మధ్యాహ్నం 2 గంటలకు కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెదక్‌లో మల్లిఖార్జున ఖర్గే పాదయాత్ర నిర్వహిస్తారు.