చంద్రబాబు అరెస్ట్ కక్షపూరిత చర్య.. ఆయనను ఏపీ ప్రభుత్వం విడుదల చేయాలి: తెలంగాణ స్పీకర్ పోచారం

By Sumanth Kanukula  |  First Published Oct 28, 2023, 5:01 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ వ్యవహారంపై తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి స్పందించారు.



తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ వ్యవహారంపై తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైన చర్య అని అన్నారు. దక్షిణ భారతదేశంలో సీనియర్ నాయకుడు చంద్రబాబు అని చెప్పారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా కమ్మవారి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ..చంద్రబాబు వ్యక్తిత్వాన్ని గౌరవించాలని అన్నారు. 

చంద్రబాబు 49 రోజులుగా జైల్లో ఉన్నారని.. ఆయనకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని తాను ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని స్పీకర్ పోచారం చెప్పారు. బాన్సువాడలో కమ్మ సోదరుల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని అన్నారు. 

Latest Videos

ఇదిలాఉంటే, గతంలో కూడా చంద్రబాబు అరెస్ట్‌పై పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను పోచారం ఖండించారు.చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలు మంచిది కాదన్నారు. కారణం లేకుండా ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టడం మంచిది కాదని పేర్కొన్నారు. అయితే పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండించిన సంగతి తెలిసిందే. 

click me!