అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు .. బీజేపీ మేనిఫెస్టో విడుదల, ఒకే రోజు నాలుగు సభలు

By Siva Kodati  |  First Published Nov 14, 2023, 9:50 PM IST

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఈ నెల 17న తెలంగాణలో పర్యటించాల్సి వుంది. అయితే అది అనివార్య కారణాలతో 18కి వాయిదా పడింది. 


కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఈ నెల 17న తెలంగాణలో పర్యటించాల్సి వుంది. అయితే అది అనివార్య కారణాలతో 18కి వాయిదా పడింది. ఆ రోజున బీజేపీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేయనున్నారు. అనంతరం నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్ సభల్లో అమిత్ షా పాల్గొననున్నారు. 

ఇకపోతే.. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో ఓటర్లకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, బీమా క‌వ‌రేజీ వంటి హామీలు ఉండ‌నున్నాయ‌ని స‌మాచారం. ఓటర్లకు ఉచిత విద్య, ఆయుష్మాన్ భారత్ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికీ జీవిత బీమా, రైతుల నుంచి క్వింటాలుకు రూ.3100 చొప్పున ధాన్యం కొనుగోలు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.20 వేలు, ప్ర‌తి మ‌హిళ‌కు ఏడాదికి 12 వేల రూపాయ‌ల సాయం, రూ.500 సిలిండ‌ర్ అందించ‌డం వంటి హామీలు ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. అలాగే, తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా జాన‌ ఔషధి కేంద్రాలు, యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ పరీక్షలకు జాబ్ క్యాలెండర్, మతపరమైన పర్యాటకాన్ని పెంచుతామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

Latest Videos

undefined

ALso Read: బీజేపీ మేనిఫెస్టోలో అందరికీ ఉచిత వైద్యం, బీమా కవరేజీ.. !

అలాగే, రాష్ట్రంలో ఐఐటీ, ఎయిమ్స్ త‌ర‌హాలో విద్యాసంస్థల స్థాపన , ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు క‌ట్టివ్వ‌డం వంటివి కూడా ఉన్నాయ‌ని స‌మాచారం. దీంతో పాటు రజకులు, నాయీబ్రాహ్మణులు, వడ్రంగులు, విశ్వబ్రాహ్మణులు, చేతివృత్తులవారు, చిరు వ్యాపారులకు కోసం ప్రత్యేక పథకం, ఫీజుల నియంత్రణకు చర్యలు, మహిళా సంఘాలు, రైతులకు వడ్డీలేని రుణాలు అందించ‌డం వంటివి కూడా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో ఉండున్నాయ‌ని తెలిసింది.

click me!