వీడిన కార్పెంటర్ షాపులో అస్తిపంజరం మిస్టరీ: మిత్రుడి భార్యపై కన్నేసి....

Published : Feb 12, 2021, 07:08 AM ISTUpdated : Feb 12, 2021, 07:09 AM IST
వీడిన కార్పెంటర్ షాపులో అస్తిపంజరం మిస్టరీ: మిత్రుడి భార్యపై కన్నేసి....

సారాంశం

హైదరాబాదులోని ఎస్సార్ నగర్ ప్రాంతంలో గల ఓ గోదాంలో బయటపడిన అస్తిపంజరం మిస్టరీ వీడింది. భార్యపై కన్నేసిన ఓ వ్యక్తి తన మిత్రుడిని హతమార్చినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు.

హైదరాబాద్: హైదరాబాదులోని ఎస్సార్ నగర్ లో గల ఓ కార్పెంటర్ షాపులో బయటపడిన అస్తిపంజరం మిస్టరీ వీడింది. తాళం వేసి ఉన్న గోడౌన్ తలుపులు తెరిచి చూడగా పోలీసులకు ఇనుప పెట్టెలో యువకుడి అస్తిపంజరం కనిపించింది. దేవాలయానికి చెందిన గదిని ఓ కార్పెంటర్ అద్దెకు తీసుకుని కార్పెంటర్ షాపు నడుపుతున్నాడని పోలీసులు గుర్తించారు. 

బోరబండలోని ఇందిరానగర్ ఫేజ్ 2లో అది ఉంది. పశ్చిమ బెంగాల్ రాజదాని కోల్ కతాకు చెందిన పలాష్ పాల్ శ్ర43) ఓ కార్పెంటర్. 2009లో హైదరాబాద్ నగరానికి వచ్చాడు. మొదటి భార్య మరణించగా రెండో వివాహం చేసుకున్నాడు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ కు చెందిన ప్లంబర్ కాంట్రాక్టర్ కమల్ మైతీ (50) తన కుటుంబంతో కలిసి రాజీవ్ గాంధీనగర్ లో నివసిస్తున్నాడు. ఇరువురు మంచి మిత్రులయ్యారు. అయితే కమల్ భార్యపై పలాష్ కన్నేశాడు.

ఆ విషయం తెలిసిన కమల్ అతన్ని మందలించాడు దాంతో కక్ష పెంచుకుని పలాష్ నిరీక్షించసాగాడు. కమల్ ను జనవరి 10వ తేదీన ఇందిరా నగర్ ఫేజ్ 2లో గోదాంకు రప్పించాడు. కర్రతో తలపై కొట్టి కమల్ ను హత్య చేశాడు. శవాన్ని పెట్టెలో పెట్టి తాళం వేసి పారిపోయాడు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !