మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు ఎన్నికలకై పిటిషన్: కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం

Published : Feb 11, 2021, 06:05 PM IST
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు ఎన్నికలకై పిటిషన్: కౌంటర్ దాఖలు చేయాలని  తెలంగాణ హైకోర్టు ఆదేశం

సారాంశం

మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు  గడువు ముగిసేలోపుగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు  గడువు ముగిసేలోపుగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్ పై గురువారం  నాడు హైకోర్టు విచారణ నిర్వహించింది. నిర్వహించాలని తెలంగాణ హైకోర్టులో గురువారం నాడు పిటిషన్ దాఖలైంది. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల పాలకవర్గం గడువు ముగియనుందని పిటిషనర్ చెప్పారు.

నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పిటిషనర్ కోరారు.వార్డుల పునర్విభజన జరగాల్సి ఉందని అడ్వకేట్ జనరల్  హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలు చెప్పేందుకు సమయం కావాలని ఏజీ హైకోర్టును కోరారు.రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది

త్వరలోనే ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వార్డుల విభజన ప్రక్రియ కసరత్తును ప్రారంభించింది. ఈ కార్పోరేషన్లతో పాటు పదవీకాలం పూర్తికానున్న మున్సిపాలిటీలకు  కూడ ఎన్నికల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని  ఎస్ఈసీ జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !