ఆదివారం మరో ఆరు... తెలంగాణలో 27కి చేరిన కరోనా కేసులు

Published : Mar 23, 2020, 07:19 AM IST
ఆదివారం మరో ఆరు... తెలంగాణలో 27కి చేరిన కరోనా కేసులు

సారాంశం

ఇప్పటి వరకు ఈ వైరస్ విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కనిపించింది. కానీ.. వారి నుంచి ఇతరులకు పాకడం కూడా మొదలైందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితులు రోజు రోజుకీ పెరుగుతున్నారు. ఆదివారం ఒక్కరోజే ఆరుగురిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఇద్దరు యువకులు కూడా ఉండటం గమనార్హం. వీరందరికీ ప్రభుత్వం నిర్దేశించిన ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతానికైతే అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  కాగా ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా సోకినవారి సంఖ్య 27కి చేరింది. అందులో 26 కేసులు కేవలం 9 రోజుల కాల వ్యవధిలోనే చోటుచేసుకోవడం గమనార్హం.

Also Read 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్: కేసీఆర్ అధికారిక ప్రకటన...

ఆదివారం ఈ వ్యాధి నిర్థారణ అయిన హైదరాబాద్ మహిళ(50) ఈ నెల 14వ తేదీన దుబాయి నుంచి నగరానికి వచ్చింది. మూడు రోజుల కిందటే ఆమె భర్తలో కరోనా వైరస్ ని నిర్థారించగా.. శనివారం ఆమె కుమారుడికి కూడా సోకినట్లు గుర్తించారు.కాగా.. ఆదివారం ఆమె కు కూడా కరోనా ఉన్నట్లు గుర్తించారు.

కాగా... ఇప్పటి వరకు ఈ వైరస్ విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కనిపించింది. కానీ.. వారి నుంచి ఇతరులకు పాకడం కూడా మొదలైందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఈ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31 వరకు ప్రజలంతా కేవలం నిత్యవసరాలకు మాత్రమే బయటకు రావాలని.. మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండిపోవాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu