కరోనా ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాల్లో లాక్ డౌన్ కు కేంద్రం ఆదేశాలు

By narsimha lodeFirst Published Mar 22, 2020, 6:01 PM IST
Highlights

కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో లాక్ డౌన్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ చేయాలని కేంద్రం కోరింది.

న్యూఢిల్లీ: కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో లాక్ డౌన్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ చేయాలని కేంద్రం కోరింది.

దేశంలోని 75 జిల్లాల్లో లాక్ డౌన్ చేయాలని  కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం నాడు కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి చెందకుండా 75 జిల్లాల్లో లాక్ డౌన్ చేయాలని కేంద్రం ఆదేశించింది.

ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం, విశాఖపట్టణం, విజయవాడ జిల్లాలను ఈ నెలాఖరు వరకు లాక్ ‌డౌన్ చేయాలని ఆదేశించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాలను కేంద్రం ఆదేశించింది.

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, హైద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను లాక్ డౌన్ చేయాలని కేంద్రం ఆదేశించింది.


 

click me!