సూర్యాపేటలో కలకలం: డీఎంహెచ్ఓ కుటుంబంలోని ఆరుగురికి కరోనా , తిరుపతి నుంచి రాగానే

By Siva KodatiFirst Published Dec 2, 2021, 9:34 PM IST
Highlights

సూర్యాపేటలో DMHO Family కోటా చలం (kota chalam) కుటుంబంలో ఏకంగా ఆరుగురికి కరోనా పాజిటివ్​గా తేలింది. డీఎంహెచ్​వో కోటాచలం.. నిన్న ఎయిడ్స్​డే (aids day) కార్యక్రమంలో పాల్గొని... వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించారు. ఆయనకి కరోనా పాజిటివ్​గా తేలటంతో నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఆందోళన నెలకొంది.
 

ఒమిక్రాన్ వేరియంట్​ (omicron) భారత్​లోకి ప్రవేశించిందన్న వార్తలతో ఇప్పటికే  దేశప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కర్ణాటకకు (karnataka) చెందిన ఇద్దరు వ్యక్తుల్లో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. దీంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్​ పరీక్షలు సైతం నిర్వహించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యాపేటలో DMHO Family కోటా చలం (kota chalam) కుటుంబంలో ఏకంగా ఆరుగురికి కరోనా పాజిటివ్​గా తేలింది. 

బుధవారం కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్న డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ముందు డీఎంహెచ్‌వో భార్య, కుమారుడు, కోడలుకు పాజిటివ్​గా తేలింది. శుక్రవారం  కొవిడ్‌ పరీక్ష చేయించుకున్న కోటాచలంకు కరోనా​ సోకినట్టు తేలింది. డీఎంహెచ్‌వో కుమారుడు 5 రోజుల క్రితమే జర్మనీ (germany) నుంచి వచ్చాడు. ఈ సంగతి పక్కనబెడితే.. ఆయన కుటుంబం రెండ్రోజుల క్రితం తిరుపతి వెళ్లి రావటం ఇప్పుడు మరింత ఆందోళ కలిగిస్తోంది. మరోవైపు డీఎంహెచ్​వో కోటాచలం.. నిన్న ఎయిడ్స్​డే (aids day) కార్యక్రమంలో పాల్గొని... వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించారు. ఆయనకి కరోనా పాజిటివ్​గా తేలటంతో నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఆందోళన నెలకొంది. 

Also Read:Omicron: ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఆ విదేశీయుడు భారత్ విడిచి వెళ్లాడు..!

కాగా.. తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం  గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.  మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు  రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. Telangana రాష్ట్రంలో Corona కేసుల వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం  Mask తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకొంది.  

ఇదే రకమైన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో కూడా జారీ చేసింది. కరోనా కేసుల వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ ను తప్పనిసరి చేసిందిఅంతేకాదు బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  కరోనా వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనని కోరింది. వ్యాక్సిన్ పై కచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నామని ప్రభుత్వం తెలిపింది. హోటల్, పార్క్, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వ్యాక్సినేషన్ పత్రం కచ్చితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.వ్యాక్సిన్ వేసుకొనివారికి ఎక్కడికెళ్లినా త్వరలో నో ఎంట్రీ రూల్ ను విధించనున్నారు.

 

click me!