సిరిసిల్లలో ఘోరప్రమాదం... మానేరు వాగులో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి, ముగ్గురు సురక్షితం (వీడియో)

By Arun Kumar P  |  First Published Nov 16, 2021, 1:49 PM IST

ఈత సరదా ఆరుగురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. మానేరు వాగులో మునిగి ఆరుగురు బాలురు చనిపోగా ముగ్గురు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. 


సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈత సరదా ఆరుగురు విద్యార్థులను బలితీసుకుంది. మానేరు వాగులో సరదాగా ఈతకొట్టడానికి దిగిన విద్యార్థులు బాగా లోతులోకి వెళ్ళి మునిగిపోయారు. ఒకేసారి ఆరుగురు మృత్యువాతపడటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. siricilla పట్టణంలో శివనగర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు సోమవారం సాయంత్రం  మానేరు వాగులో ఈతకొట్టడానికి వెళ్లారు. నెహ్రు నగర్ చెక్ డ్యాం వద్ద వీరంతా ఈతకు దిగారు. అయితే కొందరు విద్యార్థులు నీటిలో ఈదుకుంటూ లోతులోకి వెళ్లారు. ఇలా ఆరుగురు విద్యార్ధులు లోతులోకి వెళ్లి మునిగిపోయారు. 

Latest Videos

తోటి స్నేహితులు నీటమునిగిపోవడంతో ఆందోళనకు గురయిన మిగతా ముగ్గురు ఇంటికి పరుగెత్తారు. వారిద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్న కాలనీవాసులంతా ప్రమాదం  జరిగిన ప్రాంతానికి వెళ్లగా అప్పటికే విద్యార్థులంతా మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే  పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి రాత్రివరకు గాలింపు చర్యలు చేపట్టగా కేవలం ఓ విద్యార్థి మృతదేహం మాత్రమే లభించింది.

వీడియో

మంగళవారం ఉదయం తిరిగి గాలింపు చేపట్టగా మరో నలుగురి మృతదేహాలు కూడా లభించాయి. ఇంకా ఓ విద్యార్థి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. మృతిచెందిన విద్యార్థులంతా  సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కు చెందినవారే.  వీరంతా సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్నారు.

read more  కార్తీక స్నానాల్లో అపశృతి... కృష్ణా నదిలో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు మృతి

ఈ ఘటనలో మృతిచెందిన క్రాంతికుమార్ అనే విద్యార్థి పుట్టినరోజు ఇవాళే. దీంతో అతడి మృతదేహంవద్ద తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కూడా  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   

ఈ ప్రమాదం నుండి వాసల కళ్యాణ్, కోట అరవింద్, దిడ్డి అఖిల్ క్షేమంగా బయటపడ్డారు. అయితే వాగులో మునిగిన కొలిపాక గణేష్ మృతదేహం సోమవారమే లభించగా ఇవాళ జడల వెంకటసాయి, కొంగ రాకేష్,  శ్రీరామ్ క్రాంతి కుమార్ , తీగల అజయ్ మృతదేహాలు లభించారు.   సింగం మనోజ్ మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.

ఈ దుర్ఘటనపై సమాచారం అందింనవెంటనే సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ కళ చక్రపాణి ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

read more  అమీర్‌పేట మెట్రోస్టేషన్ నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు

ఇప్పటికే లభించిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల దవాఖానాను తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వివరాలను సేకరిస్తున్నారు. 

ఇదిలావుంటే మెదక్ జిల్లాలో ఓ తల్లి ఇద్దరు బిడ్డలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.  నమమాసాలు మోసి జన్మనిచ్చి... అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు బిడ్డలతో కలిసి ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవపడి క్షణికావేశానికి లోనయిన మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది.  

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దాదాయిపల్లి గ్రామానికి చెందిన రాజు-రజిత దంపతులు. వీరికి రిశ్వంత్(4), రక్షిత(2) సంతానం. పిల్లాపాపలతో ఆనందంగా సాగుతున్న వీరి సంసారంలో ఇటీవల అలజడి రేగింది. భార్యాభర్తల మనస్పర్దలు పెరిగి తరచూ గొడవలు జరుగుతుండేవి.ఇలా సోమవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన రజిత క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది. అదే రాత్రి ఇద్దరు బిడ్డలతో కలిసి గ్రామ శివారులోని చెరువువద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. 

 


 

click me!