టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు: శ్రీనివాస్ ను విచారిస్తున్న సిట్ బృందం

By narsimha lode  |  First Published Nov 21, 2022, 3:47 PM IST


టీఆర్ఎస్  ఎమ్మెల్యేలకు ప్రలోభాల  కేసులో  సిట్  విచారణ  కొనసాగుతుంది.  ఈ కేసులో  అరెస్టైన  సింహయాజీతో  సంబంధాలపై  ఆరా  తీసేందుకు  గాను  శ్రీనివాస్ ను  సిట్  అధికారులు  విచారిస్తున్నారు.  సిట్  విచారణకు  శ్రీనివాస్  హాజరయ్యారు. 


హైదరాబాద్: టీఆర్ఎస్  ఎమ్మెల్యేలకు  ప్రలోభాల  కేసులో  సిట్  విచారణ  కొనసాగుతుంది. ఈ కేసులో  ఆరోపణలు  ఎదుర్కొంటున్న  సింహయాజీతో  సంబంధాలున్నాయనే అనుమానంతో  శ్రీనివాస్  అనే  వ్యక్తిని సిట్  సోమవారంనాడు  విచారిస్తుంది. ఇవాళ  సిట్  విచారణకు  బీఎల్ సంతోష్,  తుషార్, జగ్గూస్వామిలు  హజరు కాలేదు.

శ్రీనివాస్ ను  ఇవాళ  విచారణకు  రావాలని సిట్  అధికారులు  గత  వారంలోనే  నోటీసులు జారీ చేశారు.ఈ  నోటీసుల ఆధారంగా  సిట్  విచారణకు  ఇవాళ శ్రీనివాస్  హాజరయ్యారు. సింహయాజీకి  కొనుగోలు చేసిన  విమాన  టికెట్లకు సంబంధించిన  విషయమై  సిట్  అధికారులు  శ్రీనివాస్ ను  ప్రశ్నిస్తున్నట్టుగా  సమాచారం.  ఈ టికెట్ల  కొనుగోలుకు  సంబంధించిన  లావాదేవీలను సిట్  అధికారులు సేకరించారు.ఈ సమాచారం ఆధారంగా  సిట్  బృందం విచారిస్తుంది.  ఈ కేసులో  కేరళ, కర్ణాటక, హర్యానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో  సిట్  బృందం  సోదాలు  చేసింది.  కేరళ రాష్ట్రంలో  ఐదు  రోజులపాటు  సోదాలు నిర్వహించిన   సిట్  బృందంలో  సభ్యురాలిగా  ఉన్న  నల్గొండ ఎస్పీ  రాజేశ్రవి  ఈ నెల  18న  హైద్రాబాద్ కు చేరుకున్నారు.ఈ కేసులో  కేరళ రాష్ట్రంలో  కీలక  సమాచారాన్ని  సిట్   బృందం  సేకరించిందని సమాచారం.  రామచంద్రభారతికి  తుషార్ కు  మధ్యవర్తిగా  ఉన్న  జగ్గుస్వామి  వ్యవహరించారని  సిట్  గుర్తించింది.  అంతేకాదు  జగ్గుస్వామికి నోటీసులు జారీ చేశారు.  తుషార్ కు  కూడా  నోటీసులు పంపారు.  ఈ  కేసులో  బీజేపీ  జాతీయ  ప్రధాన  కార్యదర్శి  బీఎల్ సంతోష్  కి  కూడా  సిట్  బృందం  నోటీసులు  జారీ చేసింది.  

Latest Videos

undefined

ఈ  ఏడాది అక్టోబర్  26న  మొయినాబాద్  ఫాం హౌస్  లో   టీఆర్ఎస్ కు చెందిన  నలుగురు  ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు  గురి చేశారనే  ఆరోపణలతో  రామచంద్రభారతి,  సింహయాజీ, నందకుమార్ లను  పోలీసులు  అరెస్ట్  చేశారు.  తాండూరు  ఎమ్మెల్యే   పైలెట్ రోహిత్  రెడ్డి  ఇచ్చిన  ఫిర్యాదు  మేరకు  మొయినాబాద్  పోలీసులు  ఈ  ముగ్గురిని  అరెస్ట్  చేసి రిమాండ్ కు  పంపారు.

also  read:ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. సిట్ ముందుకు శ్రీనివాస్.. బీఎల్ సంతోష్ హాజరుపై ఉత్కంఠ..!
ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసు  విచారణకు  తెలంగాణ ప్రభుత్వం సిట్  ఏర్పాటు  చేసింది.  హైద్రాబాద్  సీపీ  సీవీ  ఆనంద్ సిట్ కు నేతృత్వం  వహిస్తున్నారు.  అచ్చంపేట  ఎమ్మెల్యే  గువ్వల  బాలరాజు, కొల్లాపూర్  ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్ రెడ్డి,  తాండూరు  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,  పినపాక  ఎమ్మెల్యే  రేగా కాంతారావులను  ఈ  ముగ్గురు  నిందితులు  ప్రలోభపెట్టే  ప్రయత్నం  చేశారని   టీఆర్ఎస్  ఆరోపించింది.అయితే  ఈ  ఆరోపణలను  బీజేపీ  తీవ్రంగా  ఖండించింది..

click me!