అర్థరాత్రి నీటి సంపులో పడేసి రెండు నెలల పసికందు హత్య... కుటుంబసభ్యులపై అనుమానం...

Published : Nov 21, 2022, 01:18 PM ISTUpdated : Dec 03, 2022, 03:26 PM IST
అర్థరాత్రి నీటి సంపులో పడేసి రెండు నెలల పసికందు హత్య... కుటుంబసభ్యులపై అనుమానం...

సారాంశం

తల్లి పక్కలో పడుకున్న రెండు నెలల పసికందును అపహరించి, నీటిసంపులో వేసి హతమార్చిన ఘటన హైదాబాద్ లోని ఉప్పల్ లో కలకలం రేపింది.   

హైదరాబాద్ :  ఓ రెండునెలల చిన్నారిని దారుణంగా హతమార్చారు. తల్లిదగ్గర పడుకున్న చిన్నారిని ఎత్తుకెళ్లి నీటిసంపులో పడేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఆ చిన్నారికి రెండు నెలలకే నూరేళ్లు నిండాయి. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో జరిగింది. దీనికి సంబంధించి ఎస్సై రమేష్  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామంతాపూర్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సనాబేగం, భర్త మెహసిన్. వీరికి రెండు నెలల చిన్నారి ఉన్నాడు. సనాబేగం భర్త మెహసిన్ తో కలిసి, అత్తామామలు అబ్దుల్ బాబు, ఖుమర్ బేగం, ఆడపడుచు, మరుదులు వారి సంతానంతో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. వీరంతా కలిసి దాదాపుగా పదిమంది ఉంటారు వారి కుటుంబంలో.

వారంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. 19వ తేదీ రాత్రి సనాబేగం భర్త మెహసీన్ ఉద్యోగానికి వెళ్లాడు. దీంతో చిన్నారితో ఒంటరిగా పడుకోలేక సనాబేగం తన రెండు నెలల కొడుకు అబ్దుల్ రహమాన్, అత్త, ఆడపడుచు ఫౌజియా బేగం, ఆడపడుచు కుమార్తెలతో కలిసి ఒకే గదిలో పడుకుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అయితే ఒక్కసారిగా అర్థరాత్రి మెలుకువ రావడంతో లేచి చూసిన సనాబేగంకు తన పక్కలోని చిన్నారి కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై ఇల్లంతా వెతికింది. ఈ హడావుడిలో ఇంట్లోని అందరూ నిద్ర లేచారు. ఇంటి చుట్టుపక్కల, పరిసరాల్లో అంతా.. చిన్నారిని వెతికారు.

ఎక్కడా ఆచూకీ దొరకక పోవడంతో చివరికి సనాబేగం అనుమానంతో నీటి సంపులో వెతకగా.. అందులో చిన్నారి కనిపించాడు. దీంతో వెంటనే బాలుడిని బైటికి తీసి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం చిన్నారి మృతి చెందాడు. కాగా, చిన్నారి మృతిలో కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లి సనాబేగం ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటన.. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఏం చెప్పారంటే..?

ఇదిలా ఉండగా, అక్టోబర్ 18న నోయిడాలో ఇలాంటి ఘోరమే వెలుగు చూసింది. తల్లిదండ్రులు భవన నిర్మాణంలో కూలి పనులు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి ఏడు నెలల పసికందుపై ఓ వీధికుక్క దాడి చేసింది. పేగులు బయటకు రావడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లోటస్ బౌలేవార్డ్ సెక్టార్ హండ్రెడ్ లో జరిగింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్ సొసైటీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూలిపని చేసుకునే ఓ కుటుంబం తమ ఏడు నెలల పాపతో అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో ఆ రోజు సాయంత్రం వీధి కుక్క ఆ చిన్నారిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శిశువును నోయిడాలోని యధార్ధ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. పసికందు పేగులు బయటకు రావడం వల్ల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. 

మరుసటి రోజు ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వీధి కుక్కలు దాడి చేయడం ఇది మొదటిసారి కాదని ప్రతి మూడు నెలలకోసారి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. నోయిడా అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ విషయంపై  ఏఓఏ స్పందించారు. నోయిడా ఆధారిటీతో మాట్లాడానని ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి