ఫాంహౌస్ కేసులో ట్విస్ట్... బండి సంజయ్‌ అనుచరుడికి సిట్ నోటీసులు

Siva Kodati |  
Published : Nov 17, 2022, 06:12 PM ISTUpdated : Nov 17, 2022, 06:22 PM IST
ఫాంహౌస్ కేసులో ట్విస్ట్... బండి సంజయ్‌ అనుచరుడికి సిట్ నోటీసులు

సారాంశం

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫాంహౌస్‌ వ్యవహారంలో నిందితుడైన రామచంద్ర భారతికి అతను విమాన టికెట్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. 

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న సిట్ ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. ఫాంహౌస్‌ వ్యవహారంలో నిందితుడైన రామచంద్ర భారతికి ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ ఈ నిర్ణయం తీసుకుంది. 

అంతకుముందు ఇదే కేసులో తుషార్‌కు సిట్ బృందం గురువారంనాడు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 21 లోపుగా విచారణకు  రావాలని ఆ నోటీసులో పేర్కొంది.  ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తుషార్ పేరును ప్రస్తావించారు.  దీంతో  తుషార్ ను  విచారణకు  రావాలని సిట్  బృందం  ఆయనకు  నోటీసులు జారీ  చేసింది.

ALso Read:కేసీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్‌లో కలకలం.. ఆ నేతల్లో అసంతృప్తి, భవిష్యత్తుపై ఆందోళన..!

మొయినాబాద్  ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు  గురి చేశారని రామచంద్రభారతి, సింహయాజీ,  నందకుమార్‌లను  పోలీసులు  అరెస్ట్ గత  నెల  26న అరెస్ట్ చేసిన విషయం  తెలిసిందే.  ఈ కేసు  విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను  ఏర్పాటు  చేసింది. సిట్ కు  హైద్రాబాద్ సీపీ  సీవీ  ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారు.  సిట్ దూకుడుగా  ఈ కేసును  విచారిస్తుంది.  కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్  , హర్యానా  రాష్ట్రాల్లో  సిట్  సోదాలు నిర్వహించింది. కేరళ రాష్ట్రంలో ఇద్దరిని సిట్  అదుపులోకి  తీసుకుంది. 

తుషార్  కి రామచంద్రభారతికి ఈ డాక్టర్ మధ్యవర్తిగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. రామచంద్రభారతి తుషార్ పేరును ప్రస్తావించినట్టుగా ఆడియో సంభాషణల్లో ఉంది. ఈ నెలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో తుషార్ పేరును కూడా ప్రస్తావించారు. కేంద్  హోంమంత్రితో తుషార్  సమావేశమైన ఫోటోను  కూడా  మీడియా సమావేశంలో  కేసీఆర్  చూపించిన  విషయం  తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
రాష్ట్రంలోమంత్రులంతా దొరికిందిదోచుకోవడమే: KTR Comments on CM Revanth Reddy | Asianet News Telugu