సింగరేణి విషయంలో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషీ విమర్శించారు. సింగరేణిపై ఏ నిర్ణయం తీసుకొన్నా రాష్ట్రమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
యాదగిరిగుట్ట:కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసే సమయం దగ్గర్లోనే ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు.గురువారంనాడు యాదాద్రి ఆలయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ సందర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తుంది కేంద్ర మంత్రి అన్నారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వ వాటా కంటే తక్కువగా ఉందన్నారు. సింగరేణి విషయంలో ఏ నిర్ణయం తీసుకొన్నా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తుందని టీఆర్ఎస్ పై ఆయన మండిపడ్డారు. అబద్దాలతో ప్రజలను నమ్మించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అబద్దాలు చెప్పే కంపెనీని కేసీఆర్ తయారు చేసుకున్నారన్నారు. అబద్దాలు మానుకోవాలని కేసీఆర్ కు సూచిస్తున్నామని ఆయన తెలిపారు.
సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఈ నెల 12న రామగుండం వచ్చిన ప్రధాని టూర్ కు వ్యతిరేకంగా సింగరేణిలోని కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. రామగుండం సభలో ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని స్పష్టం చేశారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటానే ఎక్కువ ఉన్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు.
రామగుండంలో ప్రధాని మోడీ టూర్ ను తెలంగాణలో విద్యార్ధి ఐక్య కార్యాచరణ కమిటీ, సింగరేణి కార్మిక సంఘాలు, టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.సింగరేణికి చెందిన బొగ్గు గనులను ప్రైవేకరించడం కూడా సింగరేణి ప్రైవేటీకరణలో భాగమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.