ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: రామచంద్రభారతి కేంద్రంగా సిట్ విచారణ

By narsimha lode  |  First Published Nov 22, 2022, 2:25 PM IST


మొయినాబాద్  ఫాం  హౌస్  కేసులో  సిట్  విచారణ  చేస్తుంది.  ఈ కేసులో రామచంద్రభారతి కేంద్రంగా  సిట్  బృందం  విచారిస్తుంది.  ఈ  కేసులో  ఇప్పటికే  రామచంద్రభారతి  సహా  మరో  ఇద్దరిని పోలీసులు  అరెస్ట్  చేసిన  విషయం  తెలిసిందే. 


హైదరాబాద్:రామచంద్రభారతి కేంద్రంగా  సిట్  విచారణ  సాగిస్తుంది. రెండేళ్లుగా  రామచంద్రభారతి  ఎక్కడెక్కడ  ఉన్నాడనే  విషయమై  సిట్  బృందం  విచారిస్తుంది.  రామచంద్రభారతి  ఫోన్  లో ఉన్న సమాచారాన్ని  సిట్  బృందం  సేకరించింది.   రామచంద్రభారతికి  ఎవరెవరితో  సంబంధాలున్నాయనే  విషయమై  ఆరా  తీస్తుంది  సిట్ .ఢిల్లీలో ఉంటున్న  రామచంద్రభారతికి పైలెట్  రోహిత్ రెడ్డితో  ఎలా కాంటాక్టు చేశారనే  విషయమై సిట్  దర్యాప్తు  చేస్తుంది. 

మొయినాబాద్  ఫాంహౌస్ లో  ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసులో   రామచంద్రభారతి,  సింహయాజీ,  నందకుమార్ లను  పోలీసులు  గత  నెల  26వ  తేదీన  అరెస్ట్  చేశారు. తాండూరు  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్  రెడ్డి  ఫిర్యాదు  మేరకు  పోలీసులు ఈ  ముగ్గురిని పోలీసులు  అరెస్ట్  చేశారు.

Latest Videos

undefined

అచ్చంపేట  ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు,  కొల్లాపూర్  ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్  రెడ్డి,  పినపాక  ఎమ్మెల్యే  రేగా కాంతారావు,  తాండూరు  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్  రెడ్డిలను  ఈ  ముగ్గురు  ప్రలోభ పెట్టేందుకు  ప్రయత్నించారని ఆరోపణలు  వచ్చాయి.  ఎమ్మెల్యేలను  ప్రలోభాల  వెనుక  బీజేపీ  ఉందని  టీఆర్ఎస్ ఆరోపించింది.  ఈ ఆరోపణలను  బీజేపీ తోసిపుచ్చింది. తమ  పార్టీలో చేర్చుకోవాలంటే తామే వారితో చర్చలు జరుపుతామని  బీజేపీ  నేతలు  చెప్పారు.  మధ్యవర్తులను  ఏర్పాటు  చేసుకొని చర్చలు జరపాల్సిన  అవసరం  తమకు  లేదని  బీజేపీ  నేతలు  తేల్చి  చెప్పారు.  

also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: బీఎల్ సంతోష్‌తో పాటు మరో ఇద్దరికి లుకౌట్ నోటీసులు

ఎమ్మెల్యేల  ప్రలోభాల కేసులో  సీబీఐ, సిట్టింగ్  జడ్జి  విచారణ జరపాలని  బీజేపీ  కోరింది.ఇదే  విషయమై  కోర్టును  కూడ ఆశ్రయించింది.  అయితే  హైకోర్టు  మాత్రం సిట్  విచారణకు  మాత్రం సానుకూలంగా  స్పందించింది. హైకోర్టు  తీర్పును  సుప్రీంకోర్టు  సమర్ధించింది. ఈ  కేసులో  విచారణకు  రావాలని తుషార్, బీఎల్ సంతోష్,  జగ్గుస్వామిలకు  సిట్  నోటీసులు పంపింది.  ఈ  ముగ్గురు  నిన్న  విచారణకు  రావాల్సి  ఉంది.  కానీ  ఈ  ముగ్గురు  విచారణకు  రాలేదు.  అయితే  ఇవాళ  మాత్రం  ఈ  ముగ్గురికి  సిట్  లుకౌట్ నోటీసులు జారీ  చేసింది.  నిన్న, ఇవాళ  కూడా  అడ్వకేట్  శ్రీనివాస్ ను  సిట్  విచారిస్తుంది.  సింహయాజీకి  విమాన  టికెట్లు  ఎందుకు  కొనుగోలు  చేశారని  సిట్  ప్రశ్నించింది. పూజల  కోసం  సింహయాజీకి  విమాన  టికెట్లు  కొనుగోలు  చేసినట్టుగా  శ్రీనివాస్ చెప్పారని  సమాచారం. 

click me!