బిఆర్ఎస్ లో మొదలైన రాజీనామాలు ... కేటీఆర్ జిల్లానుండే షురూ... 

By Arun Kumar P  |  First Published Dec 18, 2023, 1:31 PM IST

కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్య వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది,  బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుడు జడ్పిటిసి దంపతులు సిద్దమయ్యారు.   


సిరిసిల్ల : ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమిపాలయ్యింది.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న కల నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీంతో గతంలో కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వలసలు కొనసాగినట్లే ఇప్పుడు పరిస్థితి రివర్స్ కానుందని ప్రచారం జరుగుతోంది. ఇది మంత్రి కేటీఆర్ సొంతజిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండే ప్రారంభమయ్యింది. 

సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, బిఆర్ఎస్ నేత లింగారెడ్డి, తంగళ్ళపల్లి జడ్పిటిసిగా కొనసాగుతున్న ఆయన భార్య మంజుల రాజీనామా చేసారు. బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు దంపతులు ప్రకటించారు. దంపతులిద్దరూ తమ రాజీనామా లేఖను సిరిసిల్ల బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్యకు పంపించారు. 

Latest Videos

గత 20 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని లింగారెడ్డి దంపతులు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషిచేసామని... ఏ పిలుపు ఇచ్చినా విజయవతంగా పూర్తిచేసేవారిమని అన్నారు. ఇలా సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేసినా తమకు తగిన గుర్తింపు దక్కలేదని అన్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యామని... ఇకపై పార్టీలో కొనసాగినా తమకు ప్రాధాన్యత దక్కుతుందని భావించడం లేదన్నారు. అందువల్లే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రామలింగారెడ్డి-మంజుల దంపతులు ప్రకటించారు. 

Also Read  ఇక పల్లె సంగ్రామం.. జనవరిలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు..

ఇలా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన లింగారెడ్డి,మంజుల దంపతులు త్వరలోనే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులతో వారు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్ పై హామీ రావడంతోనే బిఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 

  
 

click me!