ఇక పల్లె సంగ్రామం.. జనవరిలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు..

By Sairam Indur  |  First Published Dec 18, 2023, 11:22 AM IST

ఇక తెలంగాణలో గ్రామ సంగ్రామం మొదలుకానుంది. వచ్చే ఏడాది మొదట్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు (Gram panchayat polls-2024) నిర్వహించేందు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు (State Election Commission) చేస్తోంది. దీని కోసం జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.


ఇప్పుడిప్పుడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగి పాలనపై దృష్టి సారించింది. రేపో, మాపో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ పోరు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికలను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో త్వరలోనే గ్రామ సంగ్రామం మొదలుకానుంది.

తమిళనాడులో కుండపోత వర్షాలు.. పలు రైళ్లు, విమానాలు రద్దు, స్కూళ్లకు సెలవులు...

Latest Videos

వచ్చే ఏడాది జనవరి 31తో గ్రామీణ స్థానిక సంస్థల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిందని ‘తెలంగాణ టుడే’ నివేదించింది. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. అయితే తెలంగాణలో 224 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ ఆ ఫైలు గవర్నర్ ఇంకా ఆమోదముద్ర వేయలేదు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే గవర్నర్ ఆ ఫైలుపై సంతకం పెడితే మొత్తంగా 12,993 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి.

అమెరికా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీకొట్టిన కారు..

పంచాయతీరాజ్ చట్టం - 2018 ప్రకారం ప్రస్తుత పంచాయతీల పాలకవర్గం పదవీకాలం 2024 జనవరి 31తో ముగుస్తుంది. 2019లో జనవరి 1వ తేదీన ఈ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. మూడు దశల్లో జనవరి 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి డిసెంబర్ చివరి వారంలో ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 

మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు..

సాధారణంగా ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కానీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘానికి అందజేసింది. ఇప్పటికే గ్రామ కార్యదర్శులు ఉత్తర్వులకు అనుగుణంగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సహా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్ కుమార్ డిసెంబర్ 4వ తేదీన ఆదేశాలు జారీ చేశారు.

బీఆర్ఎస్ వైఫల్యం వల్లే ఏడు మండలాలను కోల్పోయాం - ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

2019లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పదేళ్ల పాటు అమల్లో ఉంటాయి. అయితే కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల కొనసాగింపు, మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే ఇవే రిజర్వేషన్లు కొనసాగిస్తే గత ఎన్నికల సమయంలో ఉన్న రిజర్వేషన్లే అమల్లో ఉంటాయి.

click me!