హైదరాబాద్ నడిబొడ్డున మహిళపై గ్యాంగ్ రేప్..నలుగురు అరెస్ట్...

By SumaBala Bukka  |  First Published Dec 18, 2023, 11:42 AM IST

 ఆమెను నేరుగా నిర్మానుష్యంగా ఉన్న ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతానికి  తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులైన మరి కొంతమందికి ఫోన్ చేసి మరీ పిలిపించాడు. 


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన మహిళల భద్రతకు సంబంధించి అనుమానాలను రేకెత్తిస్తోంది. భయాందోళనలకు దారితీసింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ  మహిళలపై సామూహిక అత్యాచారం జరిగింది. అదీ నగరం నడిబొడ్డున ఉన్న తార్నాక ఏరియాలో. ఘటన జరిగిన పది రోజుల తర్వాత ఈ విషయం వెలుగు చూడడంతో సంచలనగా మారింది.  దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…

 డిసెంబర్ 7వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. తార్నాక లోని బస్టాండ్ లో ఓ మహిళ బస్సు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అటుగా వెళుతున్న ప్రశాంత్ నగర్ కు చెందిన బర్నే యేసు (32)  అనే వ్యక్తి ఆమెను చూశాడు. మెల్లిగా ఆమెతో మాటలు కలిపాడు. ఆ తరువాత తాను కూడా అటువైపే వెళుతున్నానని ప్రశాంత్ నగర్ లో దింపేస్తానని తెలిపాడు.

Latest Videos

undefined

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు.. త్వరలో మంత్రివర్గ విస్తరణ..

అతని మాటలు నమ్మిన మహిళ అతని బైక్ పై ఎక్కింది. ఆ తర్వాత ఆమెను నేరుగా నిర్మానుష్యంగా ఉన్న ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతానికి  తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులైన మరి కొంతమందికి ఫోన్ చేసి మరీ పిలిపించాడు.  వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదుగురు స్నేహితులు కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు.

అనంతరం ఆమెను విషయం ఎవరికైనా చెపితే చంపేస్తామంటూ తీవ్రస్థాయిలో బెదిరించారు. ఈ ఐదుగురిలో ఒకరైన మధు యాదవ్ మహిళను లాలాపేటలో దింపి పరారయ్యాడు. ఆ మహిళ రాత్రి ఎలాగోలా ఇంటికి చేరుకుంది. తీవ్ర భయానికి గురైన ఆమె ఇంట్లో వారికి ఏ విషయాన్ని చెప్పలేదు. కొద్దిరోజులుగా మహిళ ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉంటుండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు విషయం ఏంటని ఆరా తీశారు. మొదట చెప్పడానికి సంశయించిన ఆమె ఆ తర్వాత బోరున ఏడుస్తూ విషయాన్నంతా చెప్పుకొచ్చింది.

ఇది విన్న తల్లిదండ్రులు వెంటనే లాలాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.  దీనిపై వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు మహిళ చెప్పిన ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి.. పది రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి స్నేహితులైన ప్రశాంత్, మధుసూదన్, రోహిత్,  తరుణ్ లను అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితుడైన యేసు కోసం గాలిస్తున్నారు. 

click me!