తహసీల్దార్ ఆఫీస్ కు తాళి కట్టి మహిళ నిరసన... జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్

By Arun Kumar PFirst Published Jul 1, 2021, 1:06 PM IST
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల తహశీల్దార్ ఆఫీస్ గేట్‌కు తాళి కట్టి బాధిత మహిళ ఆందోళనకు దిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్ అయ్యారు. 

సిరిసిల్ల: త‌మ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర ప‌ట్టా జారీ చేశార‌ని ఆరోపిస్తూ ఓ మ‌హిళ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల తహశీల్దార్ ఆఫీస్ గేట్‌కు తాళి కట్టిన ఘటనపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్ అయ్యారు. ఈ ఘటన పై విచారణ అధికారిగా సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ ను జిల్లా కలెక్టర్ నియమించారు. వెంటనే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వాస్తవ వివరాలతో సమగ్ర రిపోర్ట్ గురువారం సాయంత్రంలోగా అందజేయాలని ఆర్డీఓను అదేశించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో బాధితులు, అధికారుల తో మాట్లాడారు. 2018 లో పట్టామర్పిడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దానిపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. గురువారం సాయంత్రంలోగా విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదికను ఆర్డీఓ జిల్లా కలెక్టర్ కు సమర్పించనున్నా రు. నివేదిక ఆధారంగా బాధ్యులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోనున్నారు.

read more   తాళిబొట్టు తహసీల్దార్ ఆఫీస్ గుమ్మానికి వేలాడదీసి... బాధిత మహిళ వినూత్న నిరసన

భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వుంటే ఆదారంగా వున్న భూమి కూడా కొందరు కాజేయాలని చూస్తున్నారని బాధిత మహిళ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ఇలాంటి అక్రమాలను ఆపాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే అక్రమార్కులకు సాయం చేస్తోందని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ తాళిబొట్టును మండల రెవెన్యూ కార్యాలయ గుమ్మానికి వేలాడదీసి నిరసనకు దిగింది.  

రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం-మంగ దంపతులకు 2 ఎకరాల భూమి వుండేది. అయితే మూడు సంవత్సరాల క్రితం రాజేశం చనిపోగా అతడి పేరిట వున్న భూమిని మంగ తన పేరిట పట్టా చేయించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ అధికారుల అండదండలతో ఆ భూమిని కొందరు కబ్జా చేశారు. మూడు సంవత్సరాలుగా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదనకు గురయిన మంగ తన తాళిబొట్టు తీసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ గెట్ కి వేలాడదీసింది. ఈ తాళిబొట్టును లంచంగా తీసుకొని అయినా తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకొంది. 
 

click me!