మోసం చేసి రెండో పెళ్లి.. నవ వధువు ఆత్మహత్య..!

Published : Jul 01, 2021, 01:03 PM IST
మోసం చేసి రెండో పెళ్లి.. నవ వధువు ఆత్మహత్య..!

సారాంశం

మొదటి భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మించి మరో  యువతిని పెళ్లాడాడు. కాగా.. పెళ్లైన కొద్ది నెలలకు ఆ విషయం యువతికి తెలిసిపోయింది. 

అతనికి అప్పటికే పెళ్లయ్యింది. భార్యకు విడాకులు కూడా ఇవ్వలేదు. అయితే.. ఈ విషయాన్ని దాచి పెట్టారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మించి మరో  యువతిని పెళ్లాడాడు. కాగా.. పెళ్లైన కొద్ది నెలలకు ఆ విషయం యువతికి తెలిసిపోయింది. దీంతో.. తీవ్ర మనో వేధనకు గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాండూర్ మండలం చెంగోల్‌ గ్రామంలో ప్రియాంక (21) అనే వివాహిత ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త రంగప్ప, మామ ఆశప్ప వేధింపులే మృతికి కారణమంటూ మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలోనే రంగప్ప మొదటి వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నట్లు చెప్పి మోసం చేసి ప్రియాంకను రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

విడాకులు ఇవ్వలేదని తెలియడంతో లోలోన ప్రియాంక కుమిలి పోయింది. దీంతోపాటు భర్త, మామ వేధింపులు కూడా ఎక్కువయ్యాయని.. దీంతో తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ప్రియాంక తండ్రి ఫిర్యాదు చేశారు. భర్త, మామపై కరణ్ కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?