ఆరేళ్ల చిన్నారిపై సిరిసిల్ల టీఆర్ఎస్ నేత అత్యాచారం... పార్టీ నుండి సస్పెండ్

By Arun Kumar PFirst Published Oct 31, 2021, 9:21 AM IST
Highlights

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనలో నిందితుడయి టీఆర్ఎస్ లీడర్, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల రైతుబంధు కన్వీనర్ శంకర్ పై అధికార పార్టీ చర్యలు తీసుకుంది.  

సిరిసిల్ల: అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడొకడు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన అమానుషం సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో సదరు నాయకుడిపై టీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంది. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ శంకర్ ను పదవినుండి తొలగించడంతో పాటు పార్టీ నుండి కూడా సస్పెండ్ చేస్తున్నట్లు  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ఇంచార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రకటించారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు Vinod kumar ఆదేశాలతో శంకర్ ను పార్టీనుండి సస్పెండ్ చేసినట్లు baswaraju saraiah తెలిపారు. అంతేకాకుండా చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన శంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని... బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారుల కోరామన్నారు. టీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని... తప్పు చేసినవారిని ఉపేక్షించేది లేదని సారయ్య హెచ్చరించారు.  

read more  అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి అత్యాచారం... వివాహితపై కామాంధుడి లైంగికదాడి...

చిన్నారిపై అఘాయిత్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల రైతు బంధు సమితి కన్వీనర్‌ గా టీఆర్ఎస్ నాయకుడు శంకర్ వ్యవహరిస్తున్నాడు. అతడి భార్య గ్రామ సర్పంచ్. గ్రామంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న శంకర్ అత్యంత నీచమైన పని చేసాడు. 

ఎల్లారెడ్డిపేట మండల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ పిల్లలతో కలిసి శంకర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆమె భర్త ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ రెండు మూడు రోజులకు ఒకసారి ఇంటికి వస్తుంటాడు. వీరికి కుమార్తె (6), కుమారుడు వున్నారు. 

రెండో తరగతి చదువుతున్న బాలిక గురువారం బడికి వెళ్లలేదు. చిన్నారి తల్లి విధులకు వెళ్తూ బాలికను సర్పంచి ఇంట్లో వదిలివెళ్లారు. సర్పంచి భర్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు చాక్లెట్ ఆశ చూపి  అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిపై అతి దారుణంగా rape చేశాడు.

read more  ఛీ..ఛీ.. వీడు తండ్రేనా.. యేడాదిగా కూతురిపై అఘాయిత్యం.. జైలుకెళ్లొచ్చినా వదలనంటూ బెదిరింపు...

విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చిన మహిళ.. కుమార్తె తీవ్ర అస్వస్థతకు గురైనట్టు గుర్తించి ఆరా తీసింది. జరిగిన దారుణాన్ని తెలుసుకుని భర్తకు సమాచారమిచ్చింది. అనంతరం ఇద్దరూ ఈ విషయమై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని నిలదీశారు. ఆయన తప్పు అంగీకరించకపోగా, వారిని వాళ్ల ఇంట్లోనే బంధించి ఇంటికి lock వేశాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు శుక్రవారం ఉదయాన్నే గ్రామానికి చేరుకుని తాళాలు పగులగొట్టి బాధితులను బయటకు తీసుకొచ్చారు.

పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి పారిపోయేందుకు యత్నించిన accused కారు మీద దాడి చేశారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబానికి మద్దతుగా భారీ సంఖ్యలో జనం ఎల్లారెడ్డిపేటలోని ప్రధాన రహదారిమీద బైఠాయించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. వీరికి స్వేరోస్, అఖిల భారత బంజారా సంఘం, లంబాడి హక్కుల పోరాట సమితి, లంబాడి ఐక్య వేదిక, భాజపా, కాంగ్రెస్ నాయకులు మద్ధతు తెలిపారు. 

పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ చంద్రశేఖర్ ఆందోళనకారులతో చర్చించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 

click me!