Huzurabad Bypoll: ప్రైవేట్ వాహనంలో ఈవీఎంల తరలింపు... అడ్డుకున్న కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్. ఆందోళన

By Arun Kumar PFirst Published Oct 31, 2021, 8:29 AM IST
Highlights

హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం మిషన్లను ప్రభుత్వ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో తరలించారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోోళనకు దిగాయి. 

కరీంనగర్: హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సులో కాకుండా ఓ ప్రైవేట్ కారులో ఈవీఎంలను తరలించారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా ఈవీఎంలను తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న కారును ఈవీఎంలను భద్రపరుస్తున్న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అభ్యర్థి బల్మూరి వెంకట్ పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

అయితే EVM ను తరలిస్తున్నట్లు పేర్కొంటున్న కారుతో పాటు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు balmoor venkat తో పాటు congress కార్యకర్తలకు సర్దిచెప్పి అక్కడినుండి పంపించారు.  

టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలింగ్ సమయంలో అక్రమంగా వ్యవహరించడమే కాదు huzurabad polling తర్వాత కూడా ప్రజాతీర్పును మార్చే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వాహనంలో టీఆర్ఎస్ అభ్యర్థి gellu srinivas yadav మనుషులు ఈవీఎంలను తరలించారని... పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈవీఎం మిషన్లను ప్రభుత్వ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో తరలించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. 

read more  Huzurabad Bypoll: పెరిగిన ఓటింగ్ శాతం.. హుజురాబాద్‌లో గెలుపెవరిది..?

ప్రైవేట్ వాహనంలో ఈవీఎంల తరలింపు,  కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి అభ్యర్థి బల్మూరి వెంకట్ అడ్డుకోవడం, పోలీసులతో వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ  వీడియోలను కాంగ్రెస్‌, బిజెపి నాయకులు ఎన్నికల కమిషనర్‌కు పంపించి పిర్యాదు చేసారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఈసికి బిజెపి, కాంగ్రెస్ నాయకులు సూచించారు. 

 

ఇక పోలింగ్ సమయంలో టీఆర్ఎస్ అధికార అండతో అక్రమాలకు పాల్పడిందని బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా ఆరోపించారు. trs party ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ముందుకొచ్చి ఓటర్లు తనను ఆశీర్వదించారని ఈటల పేర్కొన్నారు. 

అన్ని ఉప ఎన్నికల్లో మాదిరిగా ఇక్కడ కూడా ఓటర్లకు డబ్బులు పంచి, అబద్ధాలు చెప్పి గెలవొచ్చని కేసీఆర్‌ ప్రయత్నించారని ఈటల ఆరోపించారు. కానీ, హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు చరిత్రను తిరగరాశారని రాజేందర్ అన్నారు. కేసీఆర్‌ కుట్రను హుజూరాబాద్‌ ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ రూ.400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టిందని ఈటల ఆరోపించారు. అయినా ధర్మం, ప్రజాస్వామ్యాన్ని, ఈటలను కాపాడుకోవాలని ప్రజలు భావించారని ఆయన తెలిపారు. 

read more  టీఆర్ఎస్ కోట్లు ఖర్చుచేసింది.. హుజురాబాద్‌ ఫలితంతో తెలంగాణలో పెనుమార్పులు: ఈటల వ్యాఖ్యలు

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన హుజురాబాద్ ఉపఎన్నికలో రికార్డులు అన్నీ చెరిపేస్తూ భారీ పోలింగ్ నమోదవుతోంది. నిన్న పోలింగ్ ముగిసిన సమయానికి 86శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే అప్పటికీ ఇంకా క్యూలైన్లలో ఓటర్లు వుండటంతో ఈ శాతం మరింత పెరిగే అవకాశం వుందని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఏ పార్టీకి లాభిస్తుందో, ఏ పార్టీని ముంచేస్తోందోననే ఆందోళన నేతలు, అభ్యర్ధుల్లో కనిపిస్తోంది. 

click me!