
బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) సంచలన నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్లుగా నానుతున్న వారసత్వం ఉద్యోగాల నియామకాలకు ఎట్టకేలకు ఓకే చెప్పింది. సింగరేణి బోర్డు నుంచి ఆఫ్ డైరెక్టర్స్ ఇవాళ జరిపిన సమావేశంలో వారసత్వ ఉద్యోగాలు పొందేందుకుగల అర్హతలు, ఇతర బెనిఫిట్స్‌పై నిర్ణయాలు తీసుకున్నారు.
సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో 48 నుంచి 58 సంవత్సరాల వయస్సుగల కార్మికులు రిటైర్మెంట్ తీసుకున్న పక్షంలో.. ఆ ఉద్యోగాలను వారి కొడుకులు, తమ్ముళ్లు లేదా అల్లుళ్లకు అప్పగించవచ్చు. అయితే ఉద్యోగం పొందే వారి వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన ఇవాళ జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వారసత్వ ఉద్యోగాల కల్పన చట్టం–1981ని పునరుద్ధరించడం ద్వారా న్యాయపరంగా సమస్యలు రావని అభిప్రాయపడిన తర్వాతే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.