దేశ వ్యతిరేక షాపింగ్ మాల్స్ మూసివేయండి : బీఆర్ఎస్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

By Mahesh RajamoniFirst Published Oct 15, 2023, 2:28 PM IST
Highlights

Karimnagar: తెలంగాణ‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతామనీ, ఆరు నెలల నుంచి ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత కూడా టీఎస్ పీఎస్సీ బోర్డును కొనసాగించడం 30 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడడమేన‌నీ, ప్రభుత్వం వెంటనే బోర్డును సస్పెండ్ చేసి కేసును సీబీఐకి అప్పగించాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.
 

Telangana Assembly Elections 2023: కమీషన్ల కోసం ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌త్వంలోని భార‌త రాష్ట్ర స‌మితి  (బీఆర్ఎస్) ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయ జెండాలను అమ్ముతున్న కొన్ని షాపింగ్ మాల్స్ కు అనుమతి ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ అన్నారు. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో 'లవ్ జిహాద్' పేరుతో హిందూ యువతులను ట్రాప్ చేసే కుట్ర జ‌రుగుతున్న‌ద‌ని  పేర్కొన్నారు. ఆ షాపింగ్ మాల్స్ ను వెంటనే మూసివేయాలనీ, లేనిపక్షంలో బీజేపీ చర్యలు తీసుకుంటుందని, దేశం విడిచి పారిపోయే వరకు దాడి చేస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.

ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించిన సందర్భంగా కరీంనగర్ లోని కమాన్ చౌరస్తాలో శనివారం జరిగిన వేడుకల్లో ఆయన అభిమానులతో కలిసి పాల్గొన్నారు. భారత్ విజయంపై సంజయ్ సంతోషం వ్యక్తం చేస్తూ.. దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ మ్యాచ్ ను వీక్షించారు. ప్రపంచ కప్ ను కైవసం చేసుకునేందుకు భారత జట్టు విజయ స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.  అయితే భారత్ పై పాక్ గెలవాలని కొందరు పనికిమాలిన వ్యక్తులు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అలాంటి వారు కరీంనగర్ లో నల్లజెండాలు పట్టుకొని ర్యాలీ నిర్వహిస్తే బీజేపీ వారికి తగిన గుణపాఠం చెప్పిందన్నారు. ఎవరైనా పాక్ కు మద్దతిచ్చినా, నినాదాలు చేసినా ఇదే సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు.

ఉద్యోగార్థి ప్రవల్లిక ఆత్మహత్య కేసును పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ పలుకుబడితో పోలీసు అధికారులు నకిలీ సూసైడ్ నోట్ సృష్టించి ఆమె తల్లిదండ్రులను కలచివేసే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. ఒకవేళ ఆమె ప్రేమలో విఫలమైతే సూసైడ్ నోట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించి ఉండొచ్చని తెలిపారు. రాష్ట్రంలో 50 లక్షల మంది యువత కోచింగ్ కోసం ఎంతో ఖర్చు చేసి కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలను చేజిక్కించుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందని, ప్రభుత్వ ద్రోహాన్ని ఎండగట్టాలని ఆయన అన్నారు.

తెలంగాణ‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతామనీ, ఆరు నెలల నుంచి ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ఎంపీ బండి సంజ‌య్ అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత కూడా టీఎస్ పీఎస్సీ బోర్డును కొనసాగించడం 30 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడడమేన‌నీ, ప్రభుత్వం వెంటనే బోర్డును సస్పెండ్ చేసి కేసును సీబీఐకి అప్పగించాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.

click me!