మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్ లో చేరాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కోరారు.
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్ లో చేరాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కోరారు.ఆదివారంనాడు మధ్యాహ్నం బాలసాని లక్ష్మీనారాయణ నివాసానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వెళ్లారు. ఇవాళ ఉదయమే బీఆర్ఎస్ కు బాలసాని లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరాలని బాలసాని లక్ష్మీనారాయణను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు.
బాలసాని లక్ష్మీనారాయణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. దీంతో బాలసాని లక్ష్మీనారాయణ కూడ బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వెళ్లారు. బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు.
undefined
also read:ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని.. ఏ పార్టీలో చేరనున్నారంటే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు. తొలుత బీఆర్ఎస్ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయటకు వచ్చారు. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ను వీడారు. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరారు.