మంత్రి గంగుల కమలాకర్ ప్రచార వాహనంపై చెప్పు దాడి ...

By SumaBala BukkaFirst Published Oct 31, 2023, 10:50 AM IST
Highlights

పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచారవాహనంపై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెప్పుతో దాడి చేశాడు. అతడి మీద కేసు నమోదు చేశారు. 

కరీంనగర్ : బీఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన మరువకముందే కరీంనగర్లో మరో బీఆర్ఎస్ మంత్రిపై దాడి జరిగింది. కరీంనగర్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచార రథంపై చెప్పుతో దాడి చేశారు. ఓ గవర్నమెంట్ టీచర్ ఈ దాడికి పాల్పడ్డాడు. దీంతో, అతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో… ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ కు చెందిన ఎల్ఈడి బండి  కరీంనగర్లోని గోపాల్పూర్ లో తిరుగుతోంది.  ఈ ఎన్నికల ప్రచార వాహనాన్ని చూసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగదేశ్వరా చారి  కోపంతో ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు అతడి మీద కేసు నమోదు చేశారు. 

ప్రచార జోరు పెంచిన కాంగ్రెస్.. నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ
ఇదిలా ఉండగా, సోమవారం బీఆర్ఎస్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డిపై దుబ్బాకలో కత్తితో దాడి జరిగింది. దీనికి నిరసనగా  మంగళవారం దుబ్బాక బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నాయి. రాయపోల్, దుబ్బాక, తోగుట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, చేగుంట, నార్సింగి, అక్బర్ పేట- భూంపల్లి మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి.

ఇక దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా దుబ్బాక బీజేపీ ఎంపీ రఘునందన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో బంద్ లో భాగంగా మండల కేంద్రాలు, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు నల్లజెండాలతో నిరసన కార్యక్రమాల చేపట్టాలని  బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దుబ్బాకలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.
 

 

 

click me!