ప్రచార జోరు పెంచిన కాంగ్రెస్.. నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ

Published : Oct 31, 2023, 10:48 AM IST
ప్రచార జోరు పెంచిన కాంగ్రెస్.. నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ

సారాంశం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది.  నేటీ నుంచి రెండో విడత బస్సు యాత్ర ప్రచారం ప్రారంభించనున్నది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు రాజకీయ నాయకుల వలసలు పెరుగుతుండటంతో పాటు..  ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను తమ పార్టీలోకి తిప్పుకునేందుకు నియోజకవర్గ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రత్యర్థుల బలబలాలను తెలుసుకుంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ జోరు పెంచింది. ఈ తరుణం ఆ పార్టీ నిర్వహిస్తున్న విజయభేరి రెండో విడత బస్సు యాత్ర ప్రచారం ప్రారంభం కానున్నది. 
 
ఈ ప్రచార భాగంగా ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)మరోసారి తెలంగాణకు రానున్నది.. ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం తొలుత దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం కొల్హాపూర్ లో నిర్వహించే పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభలో పాల్గొని  ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారు. కాగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దేవరకద్ర మీటింగ్ రద్దయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu