ఓటుకు నోటు కేసులో షాకింగ్ ట్విస్ట్

First Published Feb 23, 2018, 8:19 PM IST
Highlights
  • ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ పై కీలక విషయాలు చెబుతాను
  • టిడిపి, టిఆర్ఎస్ రెండు పార్టీల వారు నన్ను బెదిరిస్తున్నారు
  • సుప్రీంకోర్టుకు లేఖ రాసిన నిందితుడు జెరూసలేం మత్తయ్య

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ కేసు పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఎపి సిఎం చంద్రబాబు అమరావతికి మకాం మార్చిన పరిస్థితి ఉంది.

తాజా ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కి లేఖ రాశారు. ఈ కేసులో తాను అప్రూవర్ గా మారుతానని లేఖ లో పేర్కొన్నాడు మత్తయ్య. ఈ కేసులో ఉన్న తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ లేఖ లో మత్తయ్య వివరించారు. ఈ కేసుకి సంబంధించి తన వాదన కూడా వినాలంటూ కోరారు మత్తయ్య. తనను తెలుగుదేశం పార్టీతోపాటు టిఆర్ఎస్ పార్టీ కూడా వేధింపులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే ఈ కేసులో తాను అప్రూవర్ గా మారడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.

తన వద్ద ఉన్న కొన్ని కీలకమైన వాస్తవాలు బయటకి చెప్పి అవకాశం కల్పించండి సుప్రీంకోర్టుకు మొర పెట్టుకున్నారు. పౌరులకు ఇచ్చిన రాజ్యాంగ హక్కును కాపాడండి అని కోరారు. తనను ఉపయోగించుకొని చంద్రబాబు ని ఇరికించాలని చూశారని తెలిపారు. అసలు ఓటుకు నోటు కేసుతో తనకు సంబంధమే లేదన్నారు. క్రిస్టియన్స్ సమస్యల పైనే తాను స్టీఫెన్ సన్ ని కలిశానని వెల్లడించారు. మొత్తానికి ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య సుప్రంకోర్టుకు లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో కలవరం రేపుతోంది.

కేసు హైకోర్టు లో ఉన్న సమయంలో తనకు టీడీపీ సహకరించిందన్నారు. సుప్రీం కోర్ట్ లో ఎవరు తనకు సహరించలేదని, తనకి కనీసం సమాచారం కూడా లేదని తెలిపారు. తనకి కేటీఆర్ కి ఫోన్ చేసిన సమయంలో ఆయన్ని ఇరికించాలని ఏపీ ప్రభుత్వం చూసిందని ఆరోపించారు. సీఎం  ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని కీలకమైన వాస్తవాలు తెలియాలన్నారు. జెరూసలేం మత్తయ్య రాసిన లేఖ కింద చూడండి.

click me!