తప్పతాగి ర్యాష్ డ్రైవింగ్ చేసిన సిఐ పై కేసు

First Published Feb 23, 2018, 6:09 PM IST
Highlights
  • తాగి వాహనం నడిపిన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి సిఐ ధారావత్ కృష్ణ
  • ర్యాష్ డ్రైవింగ్ చేసిన సిఐ.. వెంబడించి పట్టుకుని కేసు నమోదు
  • సదాశివనగర్ ఎస్సై నాగరాజు సాహసం

 

నిజామాబాద్ జిల్లాలో పోలీసు అధికారుల మధ్య పంచాయితి సంచలనం రేపింది. ఒక ఎస్సై ఏకంగా సిఐ మీదే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి సంచలనం రేపారు. ఈ కేసు ఘటన జిల్లాలోనే కాక యావత్ తెలంగాణలోని పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకూ ఆ వివరాలేంటో చదువుదాం.

నిజామాబాద్ జిల్లా ధర్పల్లికి సిఐ ధారావత్ కృష్ణ ఇటీవల కాలంలో బదిలీపై వచ్చారు. గురువారం రాత్రి ఆయన ధర్పల్లిలో ఫుల్ గా మందు కొట్టి కారులో హైదరాబాద్ వస్తున్నాడు. అయితే మార్గమధ్యంలో సదాశివనగర్ (కామారెడ్డి జిల్లా పరిధిలో ఉంటంది) పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. అయితే సిఐ మఫ్టీలో ఉండి ప్రయాణిస్తున్నాడు. సిఐ వాహనాన్ని ఆపాలని సదాశివనగర్ ఎస్సై నాగరాజు కోరగా ఆపకుండా ర్యాష్ డ్రైవ్ చేస్తూ వెళ్లాడు. దీంతో సిఐ వాహనాన్ని వెంటపడి ఛేజ్ చేశారు. సమీపంలోని చెక్ పోస్టు వద్ద సిఐ వాహనాన్ని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహిస్తే తాగినట్లు తేలింది. అయితే ఆ సమయంలో తాను సిఐని అని చెప్పినా.. సదాశివనగర్ పోలీసులు పట్టించుకోలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ సిపి కార్తికేయ కస్టడీలో సిఐ కృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

click me!