Abdullapurmet double murder : ఆఖరిగా బన్నీతో గడుపుతానని... అతని కళ్లెదుటే రాసలీలలు

Published : May 06, 2022, 08:23 AM ISTUpdated : May 06, 2022, 09:03 AM IST
Abdullapurmet double murder : ఆఖరిగా బన్నీతో గడుపుతానని... అతని కళ్లెదుటే రాసలీలలు

సారాంశం

సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మెట్ ఘటనలో జ్యోతి, బన్నీని హత్య చేసింది భర్త శ్రీనివాసరావేనని.. ఆమె చివరి సారిగా బన్నీతో గడుపుతానంటే.. ఒప్పుకున్నట్టు నమ్మించి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.   

హైదరాబాద్ : abdullapurmet double murderల కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు jyothi ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ శ్రీనివాసరావుతో చెప్పింది. ఇలాంటి సందర్బం కోసమే ఎదురు చూస్తున్న అతడు వెంటనే అంగీకరించి ఆమెతోనే బన్నీకి ఫోన్‌ చేయించి తన ఇంటికి రప్పించాడు. ముగ్గురు రెండు వాహనాలపై అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ మద్యం సేవించారు. మద్యం సేవించిన తర్వాత యశ్వంత్, జ్యోతి శ్రీనివాస రావు ఎదుటే లైంగిక క్రీడలోకి దిగారు..

నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న Kolipaka Srinivasa Raoను పోలీసులు arrest చేశారు. హతురాలు అతడికి second wife అని,  ఆమె ప్రియుడితో గడపడానికి అంగీకరించినట్లు నటించి ఇద్దరిని అంతం చేశాడని పోలీసులు తేల్చారు. ఏసీపీ కే. పురుషోత్తం రెడ్డితో  కలిసి గురువారం డిసిపి సంప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు.

ఏడాది క్రితం నగరానికి..
విజయవాడలోని పాయకాపురం సుందరయ్య కాలనీకి చెందిన కొలిపాక శ్రీనివాసరావు మొదటిభార్య ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత  అనారోగ్యంతో చనిపోయింది. దీంతో సత్యవతి అలియాస్ జ్యోతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. ఐదుగురు సంతానంలో ఇద్దరికీ  వివాహాలు కాగా..  మిగిలిన ముగ్గురు విజయవాడలో నానమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఏడాది క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీనివాస రావు తన భార్య జ్యోతి తో కలిసి నగరానికి వలస వచ్చాడు.

స్క్రాప్ వ్యాపారం చేస్తున్న ఇతడు ఆరునెలల పాటు పార్సిగుట్టలో ఉండి ఆపై వారాసిగూడకు మారాడు. స్క్రాప్ వ్యాపారం చేస్తున్న ఇతడు నామాలగుండులో ఉంటున్న సమయంలో బౌద్ధ నగర్ కు చెందిన ఎడ్ల యశ్వంత్ అలియాస్ బన్నీతో జ్యోతికి పరిచయం ఏర్పడింది. గతంలో బన్నీ క్యాబ్ డ్రైవర్ గా పని చేసేవాడు. ఓ సందర్భంలో జ్యోతి అతడి క్యాబ్ బుక్ చేసుకోవడంతో  ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

వినక పోవడంతో  ‘వదిలించుకోవాలని’...
వీరి మధ్య వివాహేతర సంబంధం విషయం కొన్నాళ్ల క్రితమే శ్రీనివాసరావుకు తెలిసింది. మందలించినప్పటికీ జ్యోతి తన ప్రవర్తన మార్చుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు తన ఇంట్లోనే ఏకాంతంగా గడుపుతున్నారని తెలిసి శ్రీనివాసరావు ఆవేశంతో రగిలిపోయాడు. మాట వినని జ్యోతితో పాటు ఆమెను లోబర్చుకున్న బన్నీని అంతం చేయాలని నిర్ణయించుకుని సరైన సమయం కోసం వేచి చూశాడు.  మొదట జ్యోతిని తీసుకుని విజయవాడ కాపురం మారిస్తే పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించాడు.

ఇదే విషయం ఆమెకు చెప్పి శ్రీనివాసరావు గతవారమే సామాన్లు పంపేశాడు. ఆదివారం బైక్ మీద ఇద్దరు విజయవాడ వెళ్లాల్సి ఉంది.  ఆ సందర్భంలో జ్యోతి ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ శ్రీనివాసరావుతో చెప్పింది. ఇలాంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్న అతడు దానికి అంగీకరించి ఆమెతోనే బన్నీకి ఫోన్ఫోన్ చేయించి.. తన ఇంటికి రప్పించాడు. నగరశివార్లకు వెళ్ళిన తర్వాత అనువైన ప్రాంతంలో ఇద్దరు ఏకాంతంగా గడపాలని ఆపై తాము విజయవాడ వెళ్ళిపోతామని, నువ్వు వెనక్కి వచ్చేయమంటూ బన్నీకి చెప్పాడు.

సుత్తితో కొట్టి, స్క్రూ డ్రైవర్ తో పొడిచి…
ఈ మేరకు నామాలగుండు నుంచి శ్రీనివాసరావు, జ్యోతి ఒక వాహనంపై, బన్నీతన సోదరుడి వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో  మద్యం, బిర్యానీ ప్యాకెట్ లు తీసుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు అబ్దుల్లాపూర్మెట్ మండలం, కొత్తగూడెం గ్రామశివారులో జాతీయ రహదారిపై పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ పొదల మధ్యలో శ్రీనివాసరావు మద్యం తాగుతుండగా... కాస్త దూరంలో ఏకాంతంగా జ్యోతి, బన్నీ ఏకాంతంగా గడుపుతున్నారు. ఇద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో తన వాహనంలో నుంచి సుత్తి, స్క్రూ డ్రైవర్ తీసుకుని వెళ్లి శ్రీనివాసరావు వారిపై దాడి చేశాడు. 

వారు తేరుకునేలోపే ఇద్దరి తలలపై కొట్టాడు. ఆపై స్క్రూ డ్రైవర్ తో విచక్షణా రహితంగా పొడిచాడు. సమీపంలో ఉన్న రాయితో బలంగా మోదాడు. ఆ తరువాత అక్కడి నుంచి జ్యోతి సెల్ ఫోన్ తీసుకుని తన బండి మీద విజయవాడ వెళ్లిపోయాడు. మంగళవారం ఈ హత్యలు వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్మెట్ ఠాణాలో కేసు నమోదైంది.  ఇన్స్పెక్టర్ వి. స్వామి, ఎస్సై డి. కరుణాకర్ రెడ్డి,  ఎస్ఓటీ  ఇన్స్పెక్టర్ బి. అంజిరెడ్డి నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి వాహనంతో పాటు హత్యకు వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?