
మహబూబాబాద్ : రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి satyavathi rathod ప్రయాణిస్తున్న కారు mahabubabad district మరిపెడలో గురువారం accidentకి గురైంది. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ కు వెళ్లున్న క్రమంలో మరిపెడ పట్టణానికి చేరుకోగానే ఓ పంది అకస్మాత్తుగా రోడ్డు మీదికి వచ్చింది. దీంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. వాహనం ముందు భాగం దెబ్బతింది. కాన్వాయ్ లో ఉన్న మరో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో మంత్రికి గాయాలేమీ కాలేదు. ఆమె క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మంత్రి మరో కారులో మహబూబాబాద్ కు బయలుదేరి వెళ్లారు.
మరో వైపు ఈ ఘటనకు సంబంధించి మరో వాదన వినిపిస్తుంది. సత్యవతి రాథోడ్ కాన్వాయ్ లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెడుతుండగా.. మరిపెడ కార్గిల్ సెంటర్ సమీపంలోకి రాగానే కాన్వాయ్ కి పంది అడ్డువచ్చింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీనివల్ల వెనుక వస్తున్న వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో గన్ మెన్ లకు స్వల్పగాయాలు కాగా, మంత్రి సత్యవతి రాథోడ్ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే వేరే వాహనంలో మహబూబాబాద్ చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాలను క్లియర్ చేశారు.