ముగిసిన శిల్పా చౌదరి కస్టడీ.. చంచల్‌గూడకు తరలింపు, రాధికా రెడ్డి వ్యవహారంపై పోలీసుల ఫోకస్

By Siva Kodati  |  First Published Dec 4, 2021, 9:22 PM IST

కిట్టీ పార్టీల పేరిట సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి వందలాది కోట్లను వసూలు చేసిన శిల్పా చౌదరి (shilpa chowdary) పోలీస్ కస్టడీ ముగిసింది. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి..స్టేట్‌మెంట్ సమర్పించారు పోలీసులు. అనంతరం శిల్పా చౌదరిని చంచల్‌గూడ మహిళా జైలుకు (chanchalguda womens jail) తరలించారు. 


కిట్టీ పార్టీల పేరిట సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి వందలాది కోట్లను వసూలు చేసిన శిల్పా చౌదరి (shilpa chowdary) పోలీస్ కస్టడీ ముగిసింది. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి..స్టేట్‌మెంట్ సమర్పించారు పోలీసులు. అనంతరం శిల్పా చౌదరిని చంచల్‌గూడ మహిళా జైలుకు (chanchalguda womens jail) తరలించారు. తన స్థాయిని పెంచుకునేందుకు శిల్ప రకరకాలుగా ప్రయత్నాలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. బిల్డప్‌ కోసం… స్టేటస్‌ సింబల్‌గా బౌన్సర్లను నియమించుకున్నట్టు ఆమె చెప్పింది. 

అంతేకాదు ఆమె రెండేళ్లు అమెరికాలో (america) ఉండి వచ్చినట్లు తేలింది. అయితే.. శిల్పా చౌదరి ఎందుకు అమెరికా వెళ్లారు.. ఎవరెవరు వెళ్లారు.. అక్కడ కూడా డీలింగ్స్‌ చేశారా.. అనే కోణంలోను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘరానామోసం కేసులో రాధికారెడ్డి (radhika reddy) పేరు తెరపైకి రావడం పెద్ద దుమారం రేపుతోంది. ఆమె ఏకంగా పది రూపాయల వడ్డీకి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నట్టు తేలింది. ఆ డబ్బంతా రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌ మీదే పెట్టారా.. ఇతర రూపాల్లో మళ్లించారా.. అన్నది లెక్క తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాధికారెడ్డిని పోలీసులు సోమవారం విచారణ చేయనున్నారు.

Latest Videos

undefined

ALso Read:ఆమె మోసం చేసింది... తెరపైకి రాధికా రెడ్డి పేరు, త్వరలోనే అందరికీ సెటిల్ చేస్తా: శిల్పా చౌదరి

అంతకుముందు రెండో రోజు కస్టడీలో భాగంగా తనను రాధికారెడ్డి అనే యువతి మోసం చేసినట్లు శిల్ప పోలీసులకు తెలిపింది. ఆమె తన నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుందని శిల్ప వెల్లడించింది. రాధికా రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తోందని పోలీసులకు తెలిపింది. తనకు ఎవరినీ మోసం చేయాలనే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేసింది. అందరికీ త్వరలోనే సెటిల్ చేస్తానని శిల్పా చౌదరి పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది. 

సినిమా హాలు, ఆసుపత్రులు, కొన్ని నిర్మాణ రంగాల్లో తాను పెట్టుబడులు పెట్టానని శిల్పా చౌదరి వెల్లడించింది. చాలా మంది నాకు బ్లాక్ మనీని వైట్‌గా చేయమని ఇచ్చారని ఆమె తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో పెట్టిన డబ్బులు తిరిగి రాలేదని .. చాలా మంది ప్రముఖులు నాకు డబ్బులు ఇచ్చారని శిల్పా చౌదరి అంగీకరించింది. అంతకుముందు శిల్ప ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సీక్రెట్ లాకర్‌ను ఓపెన్ చేయించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 
 

click me!