కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బెంగళూరు (bangalore) క్యాంపులకు (camp politics) తరలి వెళ్లిన ప్రజాప్రతినిధులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. బెంగళూరు టూర్‌లో వున్న టీఆర్ఎస్ నేత, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (rasamayi balakishan) ఒక గుర్రంపై స్వారీ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బెంగళూరు (bangalore) క్యాంపులకు (camp politics) తరలి వెళ్లిన ప్రజాప్రతినిధులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. బెంగళూరు టూర్‌లో వున్న టీఆర్ఎస్ నేత, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (rasamayi balakishan) ఒక గుర్రంపై స్వారీ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గుర్రంపై స్వారీ బాగానే వుంది కానీ.. బెంగళూరులో మాస్క్ పెట్టుకోకపోవడం మరిచిపోయారంటూ జనాలు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మీరు రాష్ట్రం కానీ రాష్ట్రంలో మాస్క్ లేకుండా తిరగడం ఏంటని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అసలే కర్ణాటకలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి.అక్కడ ఏంజాయ్ చేస్తూ .. అక్కడి వైరస్‌ను తెలంగాణకు తెస్తారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
కాగా.. స్థానిక సంస్థల కోటాలో (local body quota) 12 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసేందుకు గత నెలలో ఎన్నికల కమిషన్ (election commission) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీన ఈ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు (mlc elections) జరగనున్నాయి. ఇందులో స్థానిక సంస్థల సభ్యులైన ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఓట్లు వేస్తారు. సాధారణంగా ఇందులో అధికార పార్టీ సూచించిన వ్యక్తులే ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతూ ఉంటారు. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ (trs) పార్టీకే స్థానిక సంస్థల సభ్యులు అధికంగా ఉన్నారు. అయితే ఈ సారి టీఆర్ఎస్‌కు ఆ పార్టీ నాయకుల నుంచి రెబల్స్ బెడద ఎక్కువైంది.
undefined
Also Read:క్యాంపులో ఉన్న ఆ టీఆర్ఎస్ లీడర్లకు ఓమ్రికాన్ భయం..
తమకే ఎమ్మెల్సీ పదవి వరిస్తుందని ఆశించిన భంగపడిన పలువురు ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. కొన్ని స్థానాల్లో అధికార పార్టీ ఏకగ్రీవం చేయించుకున్నప్పటికీ.. మరి కొన్ని స్థానాల్లో మాత్రం రెబల్స్ ను పోటీలో నుంచి తప్పించలేకపోయింది. దీంతో తమ పార్టీ నాయకులను బస్సుల్లో రిసార్టలకు తరలించింది. మొదట హైదరాబాద్ లో కొన్ని రోజుల పాటు క్యాంపులు పెట్టింది. తరువాత గోవా, బెంగుళూరు వంటి ప్రాంతాలకు తీసుకెళ్లారు. అయితే ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న ఆ పార్టీ నాయకులకు ఈ కొత్త వేరియంట్ వల్ల టెన్షన్ మొదలైంది. ఇండియాలో మొట్ట మొదటి సారిగా బెంగుళూరులోనే రెండు కరోనా కేసులు భయటపడటంతో అక్కడ రిసార్ట్‌లలో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. రిసార్ట్‌లలో అంతా కలిసే ఉండటం, ఎక్కడెక్కడి నుంచో బయటి వ్యక్తులు కలిసి వెళ్తూ ఉండటం వల్ల కరోనా ఎక్కడ తమపై ప్రభావం చూపుతుందో అని భయపడుతున్నారు.