హైదరాబాద్‌: రాజేంద్ర‌నగర్‌ అపార్ట్‌మెంట్‌లో కరోనా కలకలం.. ఒక వ్యక్తి నుంచి 10 మందికి పాజిటివ్

Siva Kodati |  
Published : Dec 04, 2021, 08:26 PM ISTUpdated : Dec 04, 2021, 08:35 PM IST
హైదరాబాద్‌: రాజేంద్ర‌నగర్‌ అపార్ట్‌మెంట్‌లో కరోనా కలకలం.. ఒక వ్యక్తి నుంచి 10 మందికి పాజిటివ్

సారాంశం

హైదరాబాద్ (hyderabad) రాజేంద్ర‌నగర్‌లో (rajendra nagar apartment) కరోనా కలకలం రేపింది. ఒకే అపార్ట్‌మెంట్‌లో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ అపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి.... ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. 

హైదరాబాద్ (hyderabad) రాజేంద్ర‌నగర్‌లో (rajendra nagar apartment) కరోనా కలకలం రేపింది. ఒకే అపార్ట్‌మెంట్‌లో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ అపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి.... ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అతని నుంచి అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తులకు కరోనా సోకింది. రేపు అపార్ట్‌మెంట్ వాసులకు రాపిడ్ టెస్ట్ చేయనున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.

మరోవైపు కరోనా కొత్త variant కు వేగంగా విస్తరించే గుణం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే చారిత్ర tankbund సహా చార్మినార్ ల వద్ద ‘ఫన్ డే’ వేడుకలను రద్దు చేసింది. సందర్శకులపైనే కాకుండా సాధారణ ప్రజలపై కూడా ఆంక్షలు విధించింది. ప్రతీ ఒక్కరూ mask ను విధిగా వాడాలనే ఆదేశాలను ఖచ్చితం చేసింది. దీంతోపాటు వైరస్ hotspot లుగా మారిన జియాగూడ, మేకలమండి, మలక్ పేట గంజ్, బేగం బజార్, పాతబస్తీ, మలక్ పేట్, బేగంపేట్, మాదన్నపేట, గుడి మల్కాపూర్, సరూర్ నగర్ మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు విధించింది. కొనుగోలు దారులు భౌతిక దూరం పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. 

ALso Read:Omicron : హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు.. అవేంటంటే...

దీంతోపాటు.. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌పంచ దేశాల్లో ఒమ్రికాన్ విస్త‌ర‌ణ‌, కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల నేప‌థ్యంలో అలెర్ట్ అయ్యింది. ఒక వేళ కొత్త వేరియంట్ రాష్ట్రంలోకి వ‌స్తే దానిని ఎదుర్కొవడానికి, క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన అన్ని చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంది. అందులో భాగంగా వెంటిలేటేడ్ బెడ్స్‌, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌ను సిద్ధంగా ఉంచుకున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపు 140 నుంచి 150 కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే ఇవ‌న్నీ డెల్టా ర‌కానికి చెందినవి. అయితే ఇటీవ‌ల బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన ఒక మ‌హిళ‌ల‌కు క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. అయితే ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఆమె నుంచి సేక‌రించిన న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించి, ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నారు. 

తెలంగాణలో కొత్త వేరియంట్ ప్ర‌వేశిస్తే, దాని చికిత్స కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. టిమ్స్‌లో 25 వెంటిలేటెడ్ బెడ్స్‌, 175 ఆక్సిజ‌న్ బెడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే గాంధీ హాస్పిట‌ల్ లో 100 బెడ్స్‌ను సిద్ధంగా ఉంచారు. అలాగే మ‌రికొన్ని హాస్పిట‌ల్స్‌లో ఐసీయూ వార్డుల‌, ఆక్సిజ‌న్ సిలెండర్స్‌, వెంటిలేట‌ర్ బెడ్స్ సిద్దంగా ఉంచాల‌ని ఆదేశించారు. కొత్త వేరియంట్ నేప‌థ్యంలో అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR