Shilpa Chowdary : ‘నాకేం తెలియదు’.. భోరున ఏడ్చిన శిల్పాచౌదరి..

By SumaBala BukkaFirst Published Dec 4, 2021, 12:15 PM IST
Highlights

తొలుత పోలీసులు మోసాల చిట్టాపై ప్రశ్నించగా.. శిల్ప విలపిస్తూ... ‘నాకేం తెలియదు’ అంటూ దాటవేసే ప్రయత్నం చేసింది. దాంతో పోలీసులు తమకు వచ్చిన ఫిర్యాదుల చిట్టాను.. ఆమె కోట్లు వసూలు చేసినట్లు ఆధారాలను ముందు పెట్టారు. న్యాయస్థానం అనుమతితో పోలీసులు శిల్పాచౌదరిని రెండు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. 

హైదరాబాద్ : కోట్ల రూపాయల ఆర్థిక మోసంలో అరెస్టైన shilpa chowdary.. పోలీసు విచారణలో తన డాబూ, దర్పాన్ని ప్రదర్శించారు. పలు సందర్బాల్లో కంటతడి పెట్టారని తెలిసింది. న్యాయస్థానం అనుమతితో పోలీసులు శిల్పాచౌదరిని రెండు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి రోజు ఆమెను చంచల్ గూడ మహిళా జైలు నుంచి నార్సింగ్ లోని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ వోటీ) కార్యాలయానికి తరలించారు. 

అక్కడ దర్యాప్తు అధికారులు, నార్సింగ్ ఇన్ స్పెక్టర్, అదనపు ఇన్స్ పెక్టర్ మహిళా పోలీసుల సమక్షంలో ఆమెను విచారించారు. తొలుత పోలీసులు మోసాల చిట్టాపై ప్రశ్నించగా.. శిల్ప విలపిస్తూ... ‘నాకేం తెలియదు’ అంటూ దాటవేసే ప్రయత్నం చేసింది. దాంతో పోలీసులు తమకు వచ్చిన ఫిర్యాదుల చిట్టాను.. ఆమె కోట్లు వసూలు చేసినట్లు evidenceను ముందు పెట్టారు.

కాలే డేటా రికార్డులను.. ఎవరితో ఎప్పుడు? ఎంతసేపు మాట్లాడారనే చిట్టాను తీశారు. దీంతో ఆమె ఒక్కో విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. తనది మెదక్ జిల్లా అని, ఓ బాబు ఉన్నాడని చెప్పినట్లు తెలిసింది. బాధితుల వివరాలను పోలీసులు చెబుతూ.. ‘ఇంకా చెప్పమంటారా? మీరే చెబుతారా? అని ప్రశ్నించడంతో.. ఆమె అన్ని వివరాలు పూసగుచ్చినట్లు చెప్పారని తెలిసింది. 

కాగా, కిట్టి పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన కిలాడీ లేడీ శిల్పా చౌదరికి గురువారం న్యాయస్థానం షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే శిల్పా చౌదరి  భర్తకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం శిల్పా చౌదరిని 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. 

బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకే, వారంతా అందుకే ఇలా.. కీలక విషయాలు చెప్పిన శిల్పా చౌదరి

మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి రూ. కోట్లు కాజేసిన shilpa chowdary మోసాల్లో మరో కోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. Divanos పేరుతో జూదశాలను నిర్వహించిందని సాక్ష్యాధారాలు సేకరించారు.  ఇందులో 90 మంది సెలబ్రిటీల కుటుంబాల మహిళలు ఉన్నారని గుర్తించారు. 

శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ. కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  గండి పేటలోని  సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్న శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు.

Cine celebrities కుటుంబాల్లోని మహిళలను వారాంతాల్లో పార్టీల పేరుతో ఆహ్వానించేది.  తొలుత కొంత మందితో మొదలైన Kitty partyలను తర్వాత జూదంగా  మార్చింది. దివానోస్ పేరుతో జూదశాలను  ప్రారంభించింది. సంపన్న కుటుంబాలకు చెందిన మహిళల్లో  90 మందిని సభ్యులుగా చేర్పించుకుంది. వారాంతాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసేది. 

శిల్ప చౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారన్న సమాచారంతో ఎక్కడెక్కడ భూములు కొన్నారు అన్న వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కాగా, హీరో Mahesh Babu సోదరి ప్రియదర్శని కూడా తన వద్ద నుంచి రెండు కోట్లకు పైగా తీసుకుని శిల్పా చౌదరి మోసం చేసిందని.. కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని నార్సింగి పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం శిల్ప చౌదరి చౌదరి పై ఓ ప్రముఖ సినీ  నటుడి భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

 

click me!