ఒక్కొక్కరిగా బయటకొస్తున్న శిల్పా చౌదరి బాధితులు.. ఇలా ట్రాప్ చేసేదట..!!

By Siva Kodati  |  First Published Nov 27, 2021, 5:09 PM IST

కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేసి సినీ ప్రముఖులు, ఇతరులను మోసం చేసిన  మాయ లేడీ శిల్పా చౌదరి (shilpa chowdary) కేసులో బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. క్యూట్ క్యూట్‌గా చాలా అమాయకంగా కనిపిస్తున్న శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి అని వారు చెబుతున్నారు.


కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేసి సినీ ప్రముఖులు, ఇతరులను మోసం చేసిన  మాయ లేడీ శిల్పా చౌదరి (shilpa chowdary) కేసులో బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. క్యూట్ క్యూట్‌గా చాలా అమాయకంగా కనిపిస్తున్న శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి అని వారు చెబుతున్నారు. మాయ‌మాట‌లు చెప్పి ప్రజలను ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల (kitty parties) పేరుతో పెద్దోళ్ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని వారి  పేరుతో అందరినీ చీట్ చేస్తోంది. 

పార్టీల్లో ప‌రిచ‌య‌మైన వారి నుంచి కోట్లాది రూపాయ‌ల‌ను వ‌సూల్ చేసి ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా తిరుగుతోంది. నార్సింగ్‌ (narsingi) మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లా (signature villas) లో నివాసముంటున్న శిల్పా చౌదరి గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీల ఏర్పాటు చేసింది. అక్కడికి వారిని ఆహ్వానించి వారితో పరిచయం పెంచుకునేది. తాను సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్ నంటూ నమ్మబలికి ఒక్కొక్కరి వద్దా కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు వసూలు చేసింది. 

Latest Videos

undefined

ALso Read:Shilpa Chowdary: శిల్పా చౌదరి వలలో టాలీవుడ్ హీరోలు.. వీకెండ్ పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలతో స్నేహం పెంచుకుని..

ఈ క్రమంలోనే శిల్పా చౌదరి వ్యవహారాన్ని గుర్తించిన రోహిణి అనే బాధితురాలు తాను నాలుగు కోట్ల రూపాయలను శిల్పా చౌదరి కి ఇచ్చి మోసపోయానని శనివారం నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. మంచిరేవులోని ఓ విల్లాలో తాను నివాసం ఉంటున్నట్లు రోహిణి తెలిపారు. త‌న‌తో పాటు అనేక మంది వద్ద శిల్పా చౌదరి దాదాపు వంద కోట్లకు పైగా డబ్బులు తీసుకుని మోసం చేసిందని ఆరోపించింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు గండిపేట‌‌లోని సిగ్నేచర్ అపార్ట్మెంట్ కు వెళ్లి శిల్పాను అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఆమె చేతుల్లో మోసపోయిన బాధితులు తరలి వస్తున్నారని వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. 

మరోవైపు శిల్ప బాధితుల్లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫేజ్ త్రీ పార్టీల పేరుతో సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప.. అధిక వడ్డీ రేట్లు ఇస్తానని చెప్పి రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు దండుకుని మోసం చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపట్టిన పోలీసులు.. శిల్పతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. తన బంధువుకు చెందిన ఉన్నత పాఠశాలలో పెట్టుబడి పెడతానని మాయమాటలు చెప్పి కొందరి నుంచి డబ్బులు సేకరించింది. అలాగే అధిక వడ్డీకి హామీ ఇచ్చి పలువురి నుంచి కోట్లాది రూపాయలు డబ్బు వసూలు చేసింది.
 

click me!